Eye Care Tips: కళ్ళు మన శరీరంలో ముఖ్యమైన భాగం. వాటికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వయస్సుతో పాటు మన కంటి చూపు కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే కంటి ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. మరి ఎలాంటి కూరగాయలు మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్:
కంటి ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన కూరగాయలలో క్యారెట్ ఒకటి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని మీ ఆహారంలో సలాడ్, జ్యూస్ లేదా కూరగాయల రూపంలో తినవచ్చు. క్యారెట్ తరుచుగా తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పాలకూర:
పాలకూర పోషకాల నిధి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన UV కిరణాల నుండి కళ్ళను రక్షిస్తాయి. పాలకూరలో ఉండే ఐరన్ , విటమిన్ సి కళ్లను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు పరాటా లేదా కూరగాయలలో వేసి కూడా వీటిని తినవచ్చు.
బఠానీ:
పచ్చి బఠానీలలో విటమిన్ సి, విటమిన్ ఇ , జింక్ ఉన్నాయి. ఇవి కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. బఠానీలు కళ్లలో తేమ ఉంచడంలో సహాయపడతాయి. డ్రై ఐ సిండ్రోమ్ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. మీరు దీన్ని కూరగాయలు, పులావ్ లేదా సలాడ్ లలో వేసుకుని తినవచ్చు.
బ్రోకలీ:
బ్రోకలీలో విటమిన్ సి, లుటిన్ వంటివి ఉన్నాయి. ఇవి కంటి కండరాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వయస్సు సంబంధిత కంటి వ్యాధులను కూడా నివారిస్తాయి. మీరు ఈ బ్రోకలీ వెజిటబుల్‌ని కూడా డైలీ తినవచ్చు.
Also Read: మునగ కాయలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
చిలగడదుంపలు:
స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కళ్లను పొడిబారకుండా కాపాడుతుంది. రెటీనాను రక్షిస్తుంది. చిలగడదుంపలను ఉడకబెట్టడం, కాల్చడం లేదా కూరగాయగా కూడా తినవచ్చు.