OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల కంటెంట్ లతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో చివరి వరకు సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ అవ్వడంతోనే ప్రేక్షకులు ఈ సినిమాలను బాగా థ్రిల్ అవుతూ చూస్తారు. అటువంటి కేక పెట్టించే ఒక సైకో మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గెట్ అవే‘ (Get Away). ఈ మూవీలో ముగ్గురు మగాళ్ళు ఉండే ఒక సైకో ఫ్యామిలీ, అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపుతుంటారు. వీళ్లను ముగ్గురు అమ్మాయిలు అంతం చేసే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఫ్లెక్స్ (Plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ తో ఒకప్పుడు డేటింగ్ లో ఉంటుంది. అయితే మళ్లీ డేటింగ్ కి వెళ్లాలని, ఆ ఆఫీసర్ ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత వెళ్దాం అంటూ ఆమె ఒక ఫంక్షన్ కి వెళ్తుంది. దారి మధ్యలో కారు ట్రబుల్ రావడంతో ఆగిపోతుంది. అక్కడికి ఒక సైకో ఫ్యామిలీ ఆమెను కలుస్తారు. కారు స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత ఆమె పార్టీకి వెళ్ళి తన ఇద్దరి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పబ్బులో వీళ్ళు డాన్స్ వేస్తూ మందు తాగుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఈ సైకో ఫ్యామిలీ, హీరోయిన్ తాగే డ్రింకులో మత్తు కలుపుతారు. ఆ తర్వాత హీరోయిన్ ను సైకోలు బంధించి తీసుకువెళ్తారు. ఆమెను తాడుతో కట్టేసి, బలి ఇవ్వబోతున్నామంటూ చెప్తారు. నేను మంత్రగత్తెనని, నన్ను బలి ఇస్తే మీకు చెడు జరుగుతుందని చెప్తుంది హీరోయిన్. తండ్రి, ఇద్దరు కొడుకులు ఉండే ఆ సైకో ఫ్యామిలీలో, ఆమె మాటలకు చిన్న కొడుకు మొదట భయపడతాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్తే పెద్దగా పట్టించుకోడు.
ఈ క్రమంలోనే ఫోన్లో నుంచి, బాయ్ ఫ్రెండ్ అయిన పోలీస్ కి మెసేజ్ చేస్తుంది హీరోయిన్. ఆ సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. మరోవైపు హీరోయిన్ ను బంధించినచోట, చేతబడి చేసినట్టు చూపిస్తారు. అయితే ఇదంతా హీరోయిన్ చేస్తోందని ఆ సైకోలనుకుంటారు. చివరికి హీరోయిన్ను చంపడానికి గుంత తవ్వుతుండగా, హీరోయిన్ కట్లు విడిపించుకుని గుంత తవ్వే వ్యక్తిని చంపేస్తుంది. ఆ తర్వాత మిగతా ఇద్దరూ ఆమె కోసం వెంబడిస్తారు. చివరికి ఈ ముగ్గురు అమ్మాయిలు ఆ సైకోల చేతిలో చచ్చిపోతారా? సైకోలను ఈ ముగ్గురు అమ్మాయిలు చంపేస్తారా? హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, వీళ్లను సేవ్ చేస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సైకో థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.