BigTV English

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Brahmamudi serial today Episode: కాఫీ తీసుకుని సీతారామయ్య దగ్గరకు వెళ్తుంది. అక్కడ పెట్టమ్మా అని ఆయన చెప్పగానే అక్కడ కావ్య పెట్టి వెళ్లిపోతుంటే.. వెళ్లిపోతున్నావా అమ్మా అంటూ ఎందుకమ్మా నిన్న అలాంటి పని చేశావు. ఈ ఇంట్లో అందరి కంటే నేన నిన్నే నమ్ముతాను ఎందుకో తెలుసా..? నా మనవరాలు ఎప్పుడూ పొరపాటు చేయలేదు.. చేయదు అని కానీ నువ్వు నిన్నటితో నా ఆలోచన తప్పు అని నిరూపించావు.  నిన్న నువ్వు వాడితో ఎందుకు అలా మాట్లాడావో నాకు తెలియదు. కారణం కూడా నేను అడగను.. ఎందుకంటే అది పూర్తిగా నీ సొంత నిర్ణయం నీ జీవతానికి సంబంధించిన విషయం.


మన జీవితం గాజుబొమ్మ లాంటిది అమ్మా దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటే అంత బాగుంటుంది. ఒక్కసారి చేయి జారిందంటే ముక్కలయిపోతుంది. నిన్న నువ్వు ఏ ఉద్దేశంలో ఆ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియదు కానీ నువ్వు చేసింది మాత్రం కచ్చితంగా తప్పు చేశావు. ఒకపక్క ఆ యామిని ఎప్పుడొప్పుడు వాణ్ని ఎత్తుకుపోదామని రాబందులా చూస్తుంది. ఎందుకమ్మా ఇలా చేశావు అంటూ అడుగుతాడు. దీంతో కావ్య మనసులోనే చెప్పలేను తాతయ్యగారు.. నా కడుపులో మన ఇంటి వారసుడు పెరుగుతున్నాడని ఎలా చెప్పగలను అనుకుంటుంది. సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగానా అమ్మా అంటాడు సీతారామయ్య.. దీంతో కావ్య లేదు తాతయ్యగారు మీరు అడిగిన ప్రశ్న సరైనదే కానీ నా దగ్గరే దానికి సమాధానం లేదు అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.

అందరూ హాల్లో కూర్చుని ఉండగా యామిని గట్టిగా అరుస్తూ.. కావ్య అంటూ పిలుస్తూ ఇంట్లోకి వస్తుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఎందుకు వచ్చావు.. మా కుటుంబానికి చేసిన అన్యాయం చాలదా మళ్లీ ఏం  చేయడానికి వచ్చావు అని అడుగుతుంది. దీంతో యామిని మీరు అలా అనుకుంటే భ్రమ. న్యాయంగా ఆలోచిస్తే ఈ ఇంటికి కోడలిగా రావాల్సింది నేను. అన్యయం జరిగింది నాకు అంటుంది. దీంతో అపర్ణ మరింత కోపంగా రాతలో లేదని తెలిసి కూడా సిగ్గు లేకుండా నా కొడుకును సొంతం చేసుకోవాలని చూస్తున్న నువ్వు నీతులు గురించి మాట్లాడుతున్నావా.? అంటుంది. నీతులు నాకు అనవసరం ఇంతకీ కావ్య ఎక్కడ అని అడుగుతుంది. దీంతో కావ్య ఇక్కడ.. ఇక్కడ ఉన్నాను.. ఎందుకొచ్చావు అని అడుగుతుంది.


ఏముంటుంది అక్కా మళ్లీ ఏదో ఒక పనికిరాని పని చేసి ఉంటుంది. మళ్లీ నీ చేతుల్లో ఓడిపోవడానికి వచ్చి ఉంటుంది అని అప్పు అంటుంది. మా ఫ్యామిలిలో కూడా నీచులు ఉన్నారు కానీ నీలాంటి దాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. అయినా నీలాంటి దాన్ని  మా ఇంట్లోకి రానివ్వడమే పాపం అంటూ తిడుతుంది స్వప్న. దీంతో యామిని కోపంగా నేనేం ఇక్కడ కాపురం చేయడానికి రాలేదు. మా బావ కోసం వచ్చాను. బావ ఎక్కడ..? అని యామిని అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. ఎక్కడ దాచి పెట్టారు మా బావని అంటుంది. దీంతో అపర్ణ షాకింగ్‌గా ఎంటీ వాగుతున్నావు.. రాజ్‌ మా దగ్గర ఉండటమేంటి..? నిన్నే మీ ఇంటికి వచ్చావు కదా..? అని చెప్తుంది వచ్చుంటే నేన ఇక్కడికి ఎందుకు వస్తాను. రాజ్‌ రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని యామిని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఏం చేశారు నా రాజ్‌ను ఎక్కడ దాచిపెట్టారు అని యామిని అడుగుతుంది.

దీంతో రుద్రాణి అదేంటి యామిని నిన్న రాజ్‌ ఇంటికి వచ్చాడు కదా..? రాత్రంతా ఇంటికి రాలేదా..? అని అడుగుతుంది. అదే కదా చెప్తున్నాను.. ఈ కావ్యకు తన మనసులో మాట చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని వచ్చినవాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు.. ఏం  చేశారు నా బావను అంటూ నిలదీస్తుంది యామిని. దీంతో రుద్రాణి అయిపోయింది అంతా అయిపోయింది. నిన్న కావ్య అన్న మాటలకు రాజ్‌ చిన్న బుచ్చుకుని ఎటో వెళ్లిపోయి ఉంటాడు అంటుంది రుద్రాణి. అవమానించిందా..? అంటూ యామిని అడగ్గానే… అవును అంటూ రుద్రాణి ఇంట్లో జరిగింది పూసగుచ్చినట్టు చెప్తుంది. దీంతో యామిని కోపంగా కావ్యను తిడుతుంది. అపర్ణ మరింత కోపంగా యామినిని తిడుతుంది. యామిని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రుద్రాణి ఎందుకు యామిని ఎందుకు తిట్టావు వదిన అంటూ అపర్ణను ప్రశ్నిస్తుంది.

ఇంతలో అప్పు మా వాళ్లతో నేను ఎంక్వైరీ చేయిస్తానని వెళ్తుంది. తర్వాత రూంలోకి వెళ్లి ఏడుస్తున్న కావ్యను అపర్ణ, ఇంద్రాదేవి వచ్చి ఓదారుస్తారు. ఇంతలో కావ్యకు రేవతి కాల్‌ చేసి రాజ్‌ ఇప్పుడు మా ఇంట్లోనే  క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే కావ్య హ్యాపీగా అపర్ణ, ఇంద్రాదేవికి విషయం చెప్పి రాజ్‌ కోసం వెళ్లిపోతుంది. కావ్య స్పీడుగా వెల్లడం చూసిన రుద్రాణి  ఇదేంటి ఇలా వెళ్తుంది. ఆ రాజ్‌ ఏమైనా చేసుకున్నాడా..? ఏంటి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో కిందకు వచ్చిన అపర్ణ, ఇంద్రాదేవి రాజ్‌ బాగానే ఉన్నాడని రాజ్‌ను తీసుకురావడానికే వెళ్లిందని చెప్తారు. రుద్రాణి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×