OTT Movie : హారర్-థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వీటిని ఒంటరిగా కాకపోయినా, ఫ్యామిలీతో కలసి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఓటీటీలో టాప్ లేపింది. అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నరాలు కట్ అయ్యే ట్విస్టులతో ఈ సినిమా మెంటలెక్కిస్తుంది. ఒక ఒంటరి మహిళ అసాధారణ కల్ట్ ను ఎదుర్కునే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అమెరికన్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘1BR’ 2019లో విడుదలైన ఈ సినిమాకి డేవిడ్ మార్మర్ దర్శకత్వం వహించారు. ‘1BR’ అంటే “వన్ బెడ్‌రూమ్” అని అర్థం వస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ లిస్టింగ్‌లలో సాధారణంగా ఉపయోగించే పద్యం. ఇందులో నికోల్ బ్రైడన్ బ్లూమ్, గైల్స్ మాథీ, టేలర్ నికోల్స్, అలన్ బ్లూమెన్‌ఫెల్డ్, మరియు సెలెస్ట్ సుల్లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సారా అనే అమ్మాయి లాస్ ఏంజిల్స్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్తుంది. ఆమె అనుకోకుండా ఒక డేంజరస్ కల్ట్ లో చిక్కుకుంటుంది.ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో తిరుగుతుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా Netflix లో మొదటి వారంలో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన ఐదు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
స్టోరీలోకి వెళితే
సారా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావాలని కలలు కంటుంది. ఆమె తన తండ్రితో ఉన్న విభేదాల కారణంగా, అతనికి దూరంగా ఉండటానికి లాస్ ఏంజిల్స్‌కు వెళ్తుంది. ఆమె తన తల్లి మరణం, తండ్రి మీద ఇష్టం లేకపోవడంతో, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఒక ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైన్ కోర్సులో చేరడానికి సిద్దపడుతుంది. ఇందుకోసం ఆమె ఒక టెంప్ జాబ్‌లో పనిచేస్తూ, అసిలో డెల్ మార్ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక సింగిల్ బెడ్ రూమ్ ను అద్దెకు తీసుకుంటుంది. ఈ అపార్ట్‌మెంట్ లో రూమ కోసం చాలా మంది పోటీ పడతారు. అయితే ఇది ఆమెకు లభించడం ఒక అదృష్టంగా భావిస్తుంది సారా. అక్కడ అపార్ట్‌మెంట్ మేనేజర్ జెర్రీ, పొరుగువాడు బ్రియాన్, వృద్ధ మహిళ ఈడీ స్టాన్‌హోప్ వంటి వాళ్ళు ఆమెకు చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తారు.
ఇక్కడ పెంపుడు జంతువులకు అనుమతి ఉండదు. అయినా కూడా సారా తన పెంపుడు పిల్లి గైల్స్‌ను రహస్యంగా అపార్ట్‌మెంట్‌లోకి తీసుకొస్తుంది. ఇక ఆమె రాత్రిపూట వింత శబ్దాలను వినడం మొదలుపెడుతుంది. ఆమె పిల్లి గైల్స్ కనిపించకుండా పోతుంది. ఆమె అపార్ట్‌మెంట్ డోర్ కింద ‘సెల్ఫిష్ బిచ్’ అని రాసిన ఒక లేఖ వస్తుంది. ఇది ఆమెను మరింత భయపెడుతుంది. మరో వైపు కాంప్లెక్స్‌లోని స్నేహపూర్వక వాతావరణం క్రమంగా అనుమానాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా ఒక కన్ను పోగొట్టుకున్న లెస్టర్ అనే వింత వ్యక్తి ఆమెను భయపెట్టేలా చూస్తాడు.
సినిమా దాదాపు 30 నిమిషాల తర్వాత ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఇక్కడ సారా తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ను ఒక కల్ట్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటుంది. ఈ కల్ట్ ప్రొఫెసర్ చార్లెస్ డి. ఎల్లెర్బీ రాసిన “ది పవర్ ఆఫ్ కమ్యూనిటీ” అనే పుస్తకంపై ఆధారపడి, సెల్ఫ్‌లెస్‌నెస్, ఓపెన్‌నెస్, యాక్సెప్టెన్స్, సెక్యూరిటీ అనే నాలుగు సూత్రాలను అనుసరిస్తుంది. కొత్తగా అపార్ట్మెంట్ లోకి వచ్చే వాళ్ళకు, ఈ సూత్రాలను అంగీకరించమని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకోసం వాళ్ళు మానసిక, శారీరక టార్చర్‌ను ఉపయోగిస్తారు. సారాకు ఈ కల్ట్‌లో చేరడం తప్ప వేరే మార్గం లేకుండా చేయడానికి, ఆమెను ఒక “పర్ఫెక్ట్ కేజ్”లో బంధిస్తారు. ఇక్కడ ఆమెను ఎటూ వెళ్లలేని పరిస్థితిని సృష్టిస్తారు.చివరికి సారా ఆ కల్ట్ లో చేరిపోతుందా ? ఆమెకు అపార్ట్మెంట్ లో ఎలాంటి టార్చర్ ను అనుభవిస్తుంది. అపార్ట్మెంట్ లో నుంచి ఆమె బయట పడుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ హారర్-థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఊర్లో వరుస హత్యలు… ఆ పేరున్న అమ్మాయిలే ఈ సైకో కిల్లర్ టార్గెట్