2024 Best Thriller Movies in Netflix : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు మూవీ లవర్స్. ఇందులో ఉండే సస్పెన్స్ ని చివరిదాకా చూస్తూ థ్రిల్ అవుతారు. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న అటువంటి సినిమాల గురించి తెలుసుకుందాం.
జిగ్రా (Jigra)
2024లో విడుదల అయిన ఈ సినిమాను ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా, ఆలియా భట్ నిర్మించారు. ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించాడు. అలియా భట్, వేదాంగ రైనా పాత్రలో నటించారు. తన సోదారున్ని రక్షించుకొనే క్రమంలో ఎదుర్కొనే పరిస్తితులతో, అలియా భట్ తన నటనతో ఆకట్టుకున్నారు. అక్టోబర్ 11న ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
సికిందర్ కా ముఖద్దర్ (Sekaundar ka muqaddar)
సికందర్ కా ముఖద్దర్ అనే ఈ థ్రిల్లర్ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఇందులో జిమ్మీ షీర్‌గిల్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, రాజీవ్ మెహతా, దివ్య దత్తా నటించారు. ఫ్రైడే స్టోరీటెల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ 29 నవంబర్ 2024న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది.
సైతాన్ (Shaitan)
2024లో విడుదలైన ఈ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా నటించారు. ఈ మూవీ ఒక అపరిచిత వ్యక్తి మాయలో, కుమార్తె పడినప్పుడు ఇబ్బందులను ఎదుర్కొనే కుటుంబం నుంచి స్టోరీ తిరుగుతుంది. జ్యోతిక తన తొలి చిత్రం బాలీవుడ్ లో డోలీ సాజా కే రఖ్నా తర్వాత ఈ మూవీనే చేశారు. షైతాన్ మహా శివరాత్రి సందర్భంగా 8 మార్చి 2024న థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ₹60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹211 కోట్లు వసూలు చేసింది. ఈ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
మహారాజా (Maharaja)
2024లో విడుదలైన ఈ మూవీకి జగదీష్ పళనిసామి దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతీరాజా, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 2024 జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే సన్నివేశాలలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఈ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
సెక్టార్ 36 (sector 36)
2024లో విడుదలైన ఈ మూవీని జియో స్టూడియోస్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించగా, ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు. విక్రాంత్ మాస్సే, దీపక్ డోబ్రియాల్, ఆకాష్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. సీరియల్ కిల్లర్ చేసే హత్యాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంద. ఈ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 13 సెప్టెంబర్ 2024న విడుదలైంది.