E-Paper
Advertisement

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్
Advertisement

Horror Thriller on OTT: డిమెన్షియాతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని చూసుకోవడానికి ఒక నర్సు పాత ఇంట్లోకి వెళ్తుంది. మొదట అంతా నార్మల్ గానే కనిపిస్తుంది. కానీ రాత్రి గడిచేకొద్దీ ఆ ఇంట్లో జరుగుతున్న వింత సంఘటనలు ఒక్కొక్కటిగా ఆమెను భయపెడతాయి. వృద్ధురాలి వింత ప్రవర్తనకు కారణం అనారోగ్యమా ? లేక ఆ ఇంట్లో నిజంగానే ఏదైనా దుష్టశక్తి ఉందా ? బయటకు వెళ్లే దారి లేక అదే ఇంట్లో చిక్కుకుపోయిన నర్సు చివరికి ఏం చేసింది ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘బరీ ది డెవిల్’ (Bury The Devil). మరి ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది ? ఈ సినిమా ఎందుకు డిఫరెంట్‌గా అనిపిస్తుంది ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

జూలియా ఓ నర్స్. డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధురాలు ఎవెలిన్‌ను చూసుకోవడానికి ఆమెకు ఓ పాత ఇంట్లో డ్యూటీ వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత మొదట్లో అంతా సాధారణంగానే ఉంటుంది. ఎవెలిన్ వింతగా ప్రవర్తించినా, అది ఆమె అనారోగ్యం వల్లేనని జూలియా భావిస్తుంది. కానీ చీకటి పడే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఇంట్లో వినిపించే వింత శబ్దాలు, ఎవెలిన్ ప్రవర్తనలో వచ్చే మార్పులు, చుట్టూ కనిపించే అసాధారణ పరిణామాలు జూలియాలో అనుమానాన్ని పెంచుతాయి. ఇది కేవలం డిమెన్షియా కారణంగా జరుగుతున్న విషయం కాదని ఆమెకు అర్థమవుతుంది.

Advertisement

అసలు ఎవెలిన్‌కు ఏం జరిగింది ? ఆమె అనారోగ్యానికి కారణం, దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా ? ఆ పాత ఇంట్లో నిజంగానే ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? అనే ప్రశ్నలు జూలియాను వెంటాడుతుంటాయి. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో జూలియా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు సులభంగా బయటపడే అవకాశం ఉండదు. ఒకవైపు తన సంరక్షణలో ఉన్న వృద్ధురాలు, మరోవైపు తన చుట్టూ జరుగుతున్న భయంకరమైన సంఘటనలు. దీంతో తాను కేవలం ఓ నర్సుగా అక్కడికి రాలేదని, ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నానని ఆమె గ్రహిస్తుంది.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత వస్తుంది. ‘బరీ ది డెవిల్’ను వన్‌టేక్ పద్ధతిలో తెరకెక్కించారు. అంటే సాధారణ సినిమాల్లా సన్నివేశాల మధ్య కట్స్ కనిపించవు. కెమెరా పాత్రలతో పాటు ప్రతీ నిమిషం కదులుతూ ఉండటంతో, ప్రేక్షకుడు కూడా జూలియాతో కలిసి అదే ఇంట్లో ఉన్న అనుభూతిని పొందేలా సినిమాను రూపొందించారు. దాంతో కేవలం జంప్ స్కేర్స్ ద్వారా మాత్రమే కాదు… తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ నుంచి కూడా భయం పుడుతుంది. కెమెరా ఎటు తిరిగినా అక్కడ ఏదో ప్రమాదం ఎదురవుతుందేమో అన్న ఫీలింగ్ కథను మరింత ఇంటెన్స్‌గా మారుస్తుంది.

Advertisement

మరి ఎవెలిన్‌కు, ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తికి సంబంధం ఏంటి? జూలియా అసలు నిజాన్ని ఎలా తెలుసుకుంది? ఆ ఇంటి నుంచి ఆమె ప్రాణాలతో బయటపడగలిగిందా? లేక ఆ రాత్రే ఆమె జీవితంలో చివరి రాత్రిగా మారిందా? అనేదే సినిమాలో చూసి థ్రిల్ అవ్వాల్సిన అసలైన అంశం.

తెలుగులోనూ చూడచ్చు

‘బరీ ది డెవిల్’కు ఆడమ్ ఓబ్రియాన్ దర్శకత్వం వహించారు. ఎమ్మాన్యుయేల్ లుసియర్ మార్టినెజ్ జూలియా పాత్రలో, డాన్ ఫోర్డ్ ఎవెలిన్ పాత్రలో, బిల్ రోవాట్ కీలక పాత్రలో నటించారు. సినిమా సుమారు 1 గంట 25 నిమిషాలు ఉంటుంది. ఒకే ఇంట్లో, ఒకే రాత్రిలో జరిగే కథను వన్‌టేక్ టెక్నిక్‌తో చూపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా కెమెరా కట్స్ లేకుండా కథ ముందుకు సాగడంతో ప్రేక్షకుడికి కూడా ఆ ఇంట్లో చిక్కుకుపోయిన అనుభూతి కలిగేలా సినిమా రూపొందించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వొచ్చు.

Read Also: శవాలను మాయం చేసే బిజినెస్… ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

Related News

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

కోహినూర్‌ను మించిన వజ్రం కోసం వేట… హంపి ట్రిప్ లో అదిరిపోయే ఛేజింగ్… బెంగాలీ అడ్వెంచర్ థ్రిల్లర్

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

Big Stories

Advertisement
×