E-Paper
Advertisement

కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?

కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Korean kanakaraju OTT:ఈ ఏడాది మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది.. చిరంజీవి(Chiranjeevi ), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan) ఇలా వరుస పెట్టి హీరోలు ఒకరి తర్వాత ఒకరు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంటే.. ఇప్పుడు మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా తన సినిమాతో వందల కోట్లు రాబట్టకపోయినా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. మౌత్ టాక్ తో 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. అలా రీసెంట్గా సక్సెస్ కోసం ఆరాటపడుతూ.. ఏకంగా జానర్ మార్చి ఇండో – కొరియన్ నేపథ్యంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో కొరియన్ కనకరాజు(Korean kanakaraju) సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న కొరియన్ కనకరాజు..

ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, రితికా నాయక్ (Rithika Naik) హీరోయిన్ గా ,కమెడియన్ సత్య (Sathya ) ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కొరియన్ కనకరాజు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. అటు విడుదలై మూడు వారాలు గడిచినా.. అక్కడక్కడ ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయినా సరే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది . ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా 26 కోట్ల రూపాయల భారీ డీల్ జరిగినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

వినాయక చవితి సందర్భంగా స్ట్రీమింగ్..

Advertisement

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ చిత్ర బృందంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 2వ వారంలో అనగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 11వ తేదీన కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుండి దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని యు వి క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సునీల్ , మురళీధర్ గౌడ్, బుల్లి రాజు, తులసి, వీ.టి.వీ మహేష్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.

also read:‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

కొరియన్ కనకరాజు మూవీ స్టోరీ..

Advertisement

అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన యువకుడు కనకరాజు (వరుణ్ తేజ్). చెక్కభజన ప్రదర్శనలు ఇస్తూ.. వచ్చిన డబ్బుతో కుటుంబానికి అండగా నిలుస్తూ ఉంటాడు. కిష్టప్ప (Sathya)తో స్నేహం , చెంగారెడ్డి(సునీల్) గ్యాంగ్ తో గొడవలతో కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఇక ఊరి పక్కనే ఉన్న కియా కార్ ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో కొరియా నుంచి వచ్చిన ఒక వస్తువు నుంచి కనకరాజు శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఇక అప్పటినుంచి అతని చూపులు, చేష్టలు భయంకరంగా మారిపోతాయి. ఆ ఆత్మ కోరికలను తెలుసుకున్న కనకరాజు.. తన స్నేహితులతో కలిసి కొరియా వెళ్లాల్సి వస్తుంది.. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? కనకరాజు శరీరంలోకి ఎలా ఆవహించింది? కనకరాజు ను ఆవహించిన ఆ ఆత్మ కోరికలు ఏంటి? ఆ ఆత్మ కోరికలు తీర్చడానికి కొరియా వెళ్లిన కనకరాజుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడ నుంచి తిరిగి వచ్చాడా? ఆత్మ నుంచీ విముక్తి లభించిందా? తదితర విషయాలు తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.

Related News

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

Big Stories

Advertisement
×