E-Paper
Advertisement

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ
Advertisement

Documentary OTT: ఒకప్పుడు బ్రిటిష్ పాప్ డ్యుయోలో స్టార్‌గా వెలిగిన వ్యక్తి… ఆ తర్వాత ప్రపంచ సంగీత చరిత్రలోనే ప్రముఖ మేనేజర్, ప్రొడ్యూసర్‌గా మారితే ఎలా ఉంటుంది ? ది బీటిల్స్ నుంచి జేమ్స్ టేలర్, లిండా రాన్‌స్టాడ్ట్, కరోల్ కింగ్ లాంటి దిగ్గజాల కెరీర్‌లలో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఎవరు ? తెరపై కనిపించే సూపర్‌స్టార్ల వెనుక ఉండి వారి కెరీర్‌లను మలిచిన అసలు శక్తి ఎవరు ? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘పీటర్ ఆషర్ ఎవ్రీవేర్ మ్యాన్’ (Peter Asher Everywhere Man). ఆరు దశాబ్దాల మ్యూజిక్ హిస్టరీని ఒకే వ్యక్తి జీవితంతో కలిపి చూపించే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి పీటర్ ఆషర్ ఎవరు ? ఆయన ప్రయాణం ఎలా సాగింది ? అసలు ఈ డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో ఉంది ? ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

పీటర్ ఆషర్ ప్రయాణం మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మొదలవ్వలేదు. చిన్నతనంలో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 1960లలో పీటర్ అండ్ గోర్డన్ అనే పాప్ డ్యుయోలో భాగమై స్టార్‌గా ఎదిగారు. ఈ డ్యుయోకు వచ్చిన అతిపెద్ద విజయాల్లో పాల్ మెక్‌కార్ట్నీ రాసిన పాట కీలకంగా నిలిచింది. దీంతో అమెరికా, బ్రిటన్‌లో పీటర్ అండ్ గోర్డన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆషర్ దృష్టి కొత్త టాలెంట్‌ను గుర్తించడం వైపు మళ్లింది. ది బీటిల్స్‌కు చెందిన Apple Recordsలో తొలి A&R అధిపతిగా పని చేసిన ఆయన, సంగీత ప్రపంచంలో ఎన్నో ప్రతిభావంతులను గుర్తించే అవకాశం పొందారు.

Advertisement

కానీ 1970లలో ఆయన ప్రభావం మరింత పెరిగింది. జేమ్స్ టేలర్, లిండా రాన్‌స్టాడ్ట్ వంటి ప్రముఖులతో కలిసి పని చేస్తూ వారి కెరీర్‌లను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జేమ్స్ టేలర్ సంగీత ప్రయాణంలో ఆషర్ పాత్ర చాలా కీలకం. తర్వాత లాస్ ఏంజెల్స్ మ్యూజిక్ సీన్‌లోనూ ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడే ‘Everywhere Man’ అనే టైటిల్‌కు అర్థం తెలుస్తుంది. బ్రిటిష్ పాప్ యుగం నుంచి ది బీటిల్స్ కాలం, ఆ తర్వాత కాలిఫోర్నియా సింగర్-సాంగ్‌రైటర్ ఉద్యమం వరకు ఎన్నో కీలక సంగీత ఘట్టాల్లో పీటర్ ఆషర్ ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. ఈ డాక్యుమెంటరీలో ఆయనతో కలిసి పని చేసిన కళాకారుల జ్ఞాపకాలు కూడా ప్రత్యేక ఆకర్షణ. పాల్ మెక్‌కార్ట్నీ, జేమ్స్ టేలర్, లిండా రాన్‌స్టాడ్ట్, కరోల్ కింగ్ తదితరుల ఇంటర్వ్యూల ద్వారా ఆషర్ వ్యక్తిత్వం, ఆయన పని విధానం, సంగీతంపై ఆయన ప్రభావాన్ని చూపించారు.

ఈ డాక్యుమెంటరీ ఎందుకు చూడాలి ?

‘పీటర్ ఆషర్ ఎవ్రీవేర్ మ్యాన్’కు డాన్ గెల్లర్, డేనీ గోల్డ్‌ఫైన్ దర్శకత్వం వహించారు. సుమారు 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ బయోగ్రాఫికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీకి విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్ హిస్టరీ, ది బీటిల్స్, క్లాసిక్ రాక్ ఇష్టపడేవారికి ఇది ఆసక్తికరంగా ఉంటుంది.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

Advertisement

ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 21 నుంచి రెంట్ కి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం Amazon Prime Videoలో రెంట్ ఆప్షన్‌తో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్‌ లేదు గానీ ఇంగ్షీషు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్‌ల వెనుక ఉండి వారి కెరీర్‌లను మలిచిన వ్యక్తి కథ తెలుసుకోవాలంటే ఈ మ్యూజిక్ డాక్యుమెంటరీని డోంట్ మిస్.

Read Also: పిల్లాడు చెప్పే చిన్న అబద్ధం… ఏలియన్స్ ఎంట్రీతో భారీ సమస్య… ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ కేక

Related News

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

తండ్రిని కాదని ప్రేమికురాలి కోసం వెళ్తే… దెబ్బకు గుర్తొచ్చే గత జన్మ…

Big Stories

Advertisement
×