E-Paper
Advertisement

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్
Advertisement

Telugu Short Film: ఒకే ఇంట్లో ఉంటారు… ఒకరినొకరు ప్రేమిస్తారు… కానీ మనసులో ఉన్న మాట మాత్రం బయటకు చెప్పుకోలేరు. చిన్న చిన్న అపార్థాలు, చెప్పుకోలేని భావాలు, ఈగోలు కలిసి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచితే? ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న ఇద్దరు మనుషులు, ఒకే ఇంట్లో ఉన్నా పరాయివాళ్లలా మారితే? ఆధునిక రిలేషన్‌షిప్స్‌లోని ఇలాంటి సున్నితమైన సమస్యలను చూపించే తెలుగు మినీ మూవీ ‘ఎగ్ షెల్స్’ (Egg Shells). మరి ఈ జంట మధ్య అసలు సమస్య ఏంటి? అపార్థాలు వారి ప్రేమను ఎక్కడికి తీసుకెళ్లాయి? చివరికి తమ బంధాన్ని కాపాడుకోగలిగారా? అనేది కథలో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

‘ఎగ్ షెల్స్’ కథ ఓ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకే ఇంట్లో జీవిస్తుంటారు. కానీ వారి మధ్య ఉన్న అసలు సమస్య ప్రేమ లేకపోవడం కాదు… తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచుకోలేకపోవడం. ఒకరు ఏదో ఆశిస్తారు. మరొకరు దాన్ని మరోలా అర్థం చేసుకుంటారు. మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన చోట మౌనం మొదలవుతుంది. ఆ మౌనం కాస్తా అపార్థంగా మారుతుంది. చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది. చివరకు ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరి మధ్య భావోద్వేగ దూరం పెరుగుతూ ఉంటుంది.

Advertisement

ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యం ? చెప్పకుండా మనసులో దాచుకునే విషయాలు బంధాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయి ? అనే అంశాలను ఈ సినిమాలో సహజంగా చూపించారు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు, అంచనాలు, ఈగో కారణంగా ప్రేమలో ఎలాంటి సమస్యలు వస్తాయో పాత్రల ద్వారా చూపిస్తారు. ఇక్కడే ‘ఎగ్ షెల్స్’ అనే టైటిల్‌కు అర్థం కనిపిస్తుంది. కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ప్రతి మాట, ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న తప్పు కూడా బంధాన్ని బ్రేక్ అయ్యేంత సున్నితంగా మార్చేస్తుంది.

అయితే చివరికి ఈ జంట తమ మధ్య ఏర్పడిన దూరాన్ని గుర్తిస్తారా ? అసలు సమస్య ఎక్కడ మొదలైందో అర్థం చేసుకుంటారా ? తమ ప్రేమను కాపాడుకోవడానికి ఏ నిర్ణయం తీసుకుంటారు ? లేక అపార్థాలే వారి బంధానికి ముగింపు పలుకుతాయా ? అనేదే మిగతా కథ.

తెలుగు సినిమానే

Advertisement

రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహించిన ఈ మినీ మూవీలో భారత్ గార్లపాటి, మోహన శ్రీ, త్రిప్తి గడ్డం, కివిష్ కౌటిల్య తదితరులు నటించారు. సుమారు 31 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ డ్రామా, రొమాన్స్, కామెడీ, కమింగ్ ఆఫ్ ఏజ్ అంశాలు ఉంటాయి. భారీ యాక్షన్, ట్విస్టులు లేకుండా ఆధునిక ప్రేమ సంబంధాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలను సహజంగా చూపించడం ఈ మినీ మూవీ ప్రత్యేకత. ‘ఎగ్ షెల్స్’ ప్రస్తుతం ETV Winలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 ఆగస్టు 21న విడుదలైన ఈ మినీ మూవీ Airtel Xstream Playలో కూడా ETV Win ద్వారా అందుబాటులో ఉంది. చిన్న నిడివిలో ప్రేమ, అపార్థాలు, ఎమోషన్స్, రిలేషన్‌షిప్ సమస్యలను చూడాలనుకునేవారికి ‘ఎగ్ షెల్స్’ వర్త్ వాచింగ్ అవుతుంది.

Read Also: సరస్సు దగ్గర దొరికిన డబ్బు బ్యాగ్… కట్ చేస్తే జాంబీ ప్రపంచంలో… తెలుగులోనే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×