Science Fiction movie: ఒక చిన్న పిల్లాడు తన ఫ్రెండ్స్ ముందు గొప్పగా కనిపించాలనే ఉద్దేశంతో ఓ చిన్న అబద్ధం చెబుతాడు. తన తాతయ్య మామూలు వ్యక్తి కాదని… ఏకంగా సీక్రెట్ సూపర్‌హీరో అని అందరినీ నమ్మిస్తాడు. ఇంతవరకు ఇదంతా సరదానే. కానీ అదే సమయంలో నిజంగానే ఏలియన్స్ భూమిపైకి వస్తే? తాను చెప్పిన అబద్ధమే తనకు పెద్ద సమస్యగా మారితే? ఏలియన్స్ నుంచి అందరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా తన తాతయ్యపైనే పడితే? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ ‘ది గ్రేట్ గ్రాండ్ సూపర్‌హీరో ఏలియన్స్ కా ఆగమన్’ (The Great Grand Superhero Aliens Ka Aagman). మరి దీపు చెప్పిన చిన్న అబద్ధం ఎలాంటి పెద్ద ప్రమాదానికి దారి తీసింది? అతని తాతయ్య నిజంగానే సూపర్ హీరోనా? ఏలియన్స్ అసలు ఎందుకు వచ్చారు? తెలుసుకుందాం పదండి.
కథలో ప్రధాన పాత్ర దీపు అనే స్కూల్ కుర్రాడు. కొత్త ప్రదేశానికి వచ్చిన తర్వాత స్కూల్‌లో కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకుంటాడు. వాళ్ల ముందు తనను ప్రత్యేకంగా చూపించుకోవాలనే కోరికతో తన తాతయ్య గురించి ఓ ఆసక్తికరమైన కథ చెబుతాడు. తన తాతయ్య మామూలు వ్యక్తి కాదని, ఓ సీక్రెట్ సూపర్‌హీరో అని క్లాస్‌మేట్స్‌ను నమ్మిస్తాడు. మొదట్లో దీపు చెప్పిన మాటలు పిల్లల సరదా అబద్ధంలానే ఉంటాయి. కానీ కథలోకి ఏలియన్స్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తాను ఊహల్లో సృష్టించిన సూపర్‌హీరో ప్రపంచం నిజ జీవిత సమస్యగా మారుతుంది.
ఇక్కడే తాతయ్య, మనవడి మధ్య ఉన్న అనుబంధం కథకు కీలకంగా మారుతుంది. ఒకవైపు తాతయ్యను సూపర్ హీరోగా ఊహించుకున్న దీపు… మరోవైపు మనవడి ఊహలకు దగ్గరగా ఉండే తాతయ్య. ఏలియన్ ముప్పు పెరిగే కొద్దీ వీళ్లిద్దరూ కలిసి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీపు చెప్పిన అబద్ధం ఇప్పుడు అతనికే పెద్ద సవాల్‌గా మారుతుంది. తాతయ్య నిజంగా ఏదైనా చేయగలడా ? ఫ్రెండ్స్ ముందు చెప్పిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి? కుటుంబాన్ని, స్నేహితులను ఏలియన్స్ నుంచి ఎలా కాపాడాలి? అనే ప్రశ్నలు అతని చుట్టూ తిరుగుతుంటాయి.
కథలో పిల్లల ఊహాశక్తి, సూపర్‌హీరో ఫాంటసీ, ఏలియన్ ముప్పు, కామెడీ, అడ్వెంచర్‌తో పాటు తాతయ్య-మనవడి అనుబంధాన్ని కూడా మిళితం చేశారు. చివరకు దీపు చెప్పిన చిన్న అబద్ధం ఎలా పెద్ద ప్రమాదానికి దారి తీసింది ? అసలు తాతయ్య ఎవరు ? ఏలియన్స్ నుంచి వీళ్లంతా ఎలా బయటపడ్డారు ? దీపు నేర్చుకున్న అసలు పాఠం ఏంటి? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన కథ.
మనీష్ సైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ తాతయ్య పాత్రలో నటించగా, మిహిర్ గోడ్బోలే దీపు పాత్రలో కనిపిస్తారు. కామెడీ, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఈ సినిమా సుమారు 112 నిమిషాల నిడివితో తెరకెక్కింది. పిల్లల ఊహాశక్తి, ఏలియన్స్, సూపర్‌హీరో ఫాంటసీ ఇష్టపడే చిన్నారులతో కలిసి చూడటానికి ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ‘ది గ్రేట్ గ్రాండ్ సూపర్‌హీరో: ఏలియన్స్ కా ఆగమన్’ 2026 మే 29న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.
Read Also: పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్