OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా ఓ మంచి సినిమాను చూడాలనుకున్నప్పుడు వెంటనే మలయాళం సినిమాలపై ఓ కన్ను వేస్తున్నారు ప్రేక్షకులు. అంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి ఈ మాలీవుడ్ మూవీస్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ థియేటర్లలో మెప్పించి, రీసెంట్ గానే ఓటీటీ లో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
నకులన్, శాలిని కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెడతారు. వీరి జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే కొన్ని రోజులకు పిల్లల గురించి ఇంట్లో ప్రశ్నలు మొదలు పెడతారు కుటుంభ సభ్యులు. పెళ్లి జరిగినా పిల్లలు పుట్టక పోవడంతో, సమస్యలు మొదలౌతాయి. అత్తగారు మాత్రం శాలినితో సూటి పోటి మాటలు మాట్లాడుతుంది. ఈ ఒత్తిడి శాలినిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆమె సమాజంలో కూడా సమస్యలు ఎదుర్కుంటుంది. ఇతరుల జోక్యం, విమర్శల కారణంగా నిరాశ, కోపం వంటివి శాలినిలో పెరుగుతాయి. ఒక రోజు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంటుంది.
శాలిని తన అత్తతో వాగ్వాదంలో ఉన్నప్పుడు, కోపంతో వేడి టీని ఆమె మీద పోస్తుంది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీని వల్ల ఆమెకు మరిన్ని సమస్యలు వస్తాయి. భర్త నుంచి కూడా ఆమె ఇబ్బందుల్ని ఎదుర్కుంటుంది. చివరికి శాలిని పిల్లల్ని కంటుందా ? తనకి అత్త నుంచి సమస్యలు తీరిపోతాయా ? భర్త ఆమెకు ఏ విధంగా సహాయపడతాడు ? ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వెళ్ళింది? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒకరోజు ముందే రెండు ఓటీటీల్లోకి వచ్చిన మోస్ట్ అవైటింగ్ మలయాళ కామెడీ డ్రామా… ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళ ఫ్యామిలీ డ్రామా పేరు ‘అన్పోడు కణ్మణి’ (Anpodu Kanmani). 2025లో విడుదలైన ఈ మూవీకి లిజూ థామస్ దర్శకత్వం వహించారు. విపిన్ పవిత్రన్ దీనిని నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్,అనఘ నారాయణన్, పార్వతి సతీషన్, మృదుల్ నాయర్, జానీ ఆంటోని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ కేరళలో నూతన వివాహితులైన ఒక జంట, నకులన్ (అర్జున్ అశోకన్), శాలిని (అనఘ నారాయణన్) చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మలయాళంలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.