BigTV English

OTT Movie : కంటికి కన్పించిన ప్రతిదీ పార్ట్స్ పార్ట్స్ గా కట్ అయితే… గుండె గుభేల్మన్పించే సినిమారా సామీ

OTT Movie : కంటికి కన్పించిన ప్రతిదీ పార్ట్స్ పార్ట్స్ గా కట్ అయితే… గుండె గుభేల్మన్పించే సినిమారా సామీ

OTT Movie : ఎలియన్స్ కధలతో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో గ్రహాంతర వాసూలు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. ఈ వెబ్ సిరీస్ చివరివరకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix)లో

ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ పేరు ‘3 బాడీ ప్రాబ్లం’ (3 Body Problem). 2024 లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్ కు లియు సిక్సిన్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ స్టోరీ 1960లలో చైనాలో ప్రారంభమవుతుంది. ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది. మనుషులకు గ్రహాంతర వాసి వల్ల ఏర్పడే ప్రమాదాల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

1960లలో, చైనాలో సాంస్కృతిక విప్లవం సమయంలో, యే వెంజీ అనే అమ్మాయి శాస్త్రవేత్త అయినటువంటి తన తండ్రిని కోల్పోతుంది. ఈ దుర్ఘటన తర్వాత, ఆమెను ఒక రహస్య సైన్స్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి రిక్రూట్ చేస్తారు. అక్కడ గ్రహాంతర జీవులతో ప్రయోగాలు చేస్తుంటారు. ఆమె చేసిన ఒక ప్రయోగం, భూమి నుండి ఒక సందేశాన్ని అంతరిక్షంలోకి పంపడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో భారీ పరిణామాలకు దారితీస్తుంది. ఈ సందేశం సాన్-టీ అనే గ్రహాంతర జీవులకి చేరుతుంది. అక్కడ వాళ్ళుకు మూడు సూర్యుల సౌర వ్యవస్థలో, జీవన పరిస్థితి అస్త వ్యస్తం గా ఉంటుంది. అందువల్లే వాళ్ళు భూమిని ఆక్రమించాలని అనుకుంటారు. సాన్-టీ గ్రహం నుంచి 400 సంవత్సరాలలో భూమికి చేరుకోవడానికి సిద్ధమవుతారు. ఇక్కడ భూమి మీద మనుగడ కోసం ప్రయత్నిస్తారు.

ఇప్పుడు ప్రస్తుత కాలంలో స్టోరీ జరుగుతుంది. శాస్త్రవేత్తలు కొన్ని విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని భౌతిక శాస్త్ర ప్రయోగాలు అసాధారణ ఫలితాలను చూపిస్తాయి. ‘సైన్స్ బ్రోకెన్’ అనే భావనను అందరికీ సూచిస్తాయి. ఆ తరువాత ఐదుగురు స్నేహితుల ఆక్స్‌ఫర్డ్ ఫైవ్ అని పిలువబడే శాస్త్రవేత్తల బృందం, ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఒక డిటెక్టివ్ డా షీతో కలిసి పనిచేస్తారు. వారు ఒక విచిత్రమైన వర్చువల్ రియాలిటీ గేమ్‌ను కనుగొంటారు. ఇది సాన్-టీ గ్రహం కు చెందిన మూడు సూర్యుల సమస్యను చూపిస్తుంది. ఆ గ్రహం లోని వాళ్ళ ఉద్దేశాలను వెల్లడిస్తుంది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ, సాన్-టీ గ్రహం భూమిని ఆక్రమించే ప్రణాళికను అడ్డుకోవడానికి మనుషులు కొన్ని వర్గాలుగా విడిపోతుంది. సీజన్ 1లో సాన్-టీ రాకను ఆపడం అసాధ్యమని తెలుస్తుంది. కానీ మానవాళి దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్‌ సిరీస్ మొత్తం మూడు సీజన్లలో పూర్తి కథను చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి సీజన్ విజయవంతం గా ముగియడంతో , సీజన్ 2 కోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×