E-Paper
Advertisement

OTT Movie : దెయ్యాలని తెలియక వాటితోనే కామెడీ… ఇది చూశాక మీరు ట్రైన్ జర్నీ చేయగలరా..?

OTT Movie : దెయ్యాలని తెలియక వాటితోనే కామెడీ… ఇది చూశాక మీరు ట్రైన్ జర్నీ చేయగలరా..?
Advertisement

OTT Movie : సైకోలకు దుష్టశక్తి తోడైతే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. క్రిస్మస్ పండగ వస్తే ఈ సైకో వికృతి రూపం చూపిస్తాడు. మనుషుల్ని అత్యంత దారుణంగా చంపుతూ ఉంటాడు. గుండెల్లో దడ పుట్టించే ఈ మూవీ ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ క్రిస్మస్ స్లాషర్ హారర్ మూవీ పేరు ‘టెర్రిఫైయర్ 3’ (Terrifier 3). 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి డామియన్ లియోన్ దర్శకత్వం వహించారు. ఇది 2022 లో వచ్చిన ‘టెర్రిఫైయర్ 2’కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇందులో డేవిడ్ హోవార్డ్ థోర్న్టన్, లారెన్ లావెరా, ఎలియట్ ఫుల్లమ్, సమంత స్కాఫిడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ క్రిస్మస్ సీజన్‌లో జరుగుతుంది. ఆర్ట్ ది క్లౌన్ అనే కిరాతకుడి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

‘టెర్రిఫైయర్’ 2 లో ఆర్ట్ ది క్లౌన్ కిల్లర్ చేతి నుంచి బయటపడిన సియన్నా షా, తన జీవితాన్ని మళ్లీ చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో, సియన్నా, ఆమె సోదరుడు జోనాథన్ గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలను మరచి, క్రిస్మస్ ను ఆనందంగా జరుపుకోవాలని చూస్తారు. అయితే వారు సురక్షితంగా ఉన్నామని భావించిన సమయంలోనే, ఆర్ట్ ది క్లౌన్ మళ్ళీ తిరిగి వస్తాడు. ఈసారి అతను తన కొత్త పార్ట్నర్ పాసెస్డ్ విక్టోరియా హేయ్స్ తో కలిసి, క్రిస్మస్ ఈవ్‌లో మైల్స్ కౌంటీ నివాసులపై తన సైకో పంజాను విసురుతాడు. ఈ మూవీ ‘టెర్రిఫైయర్ 2’ముగింపు నుండి కొనసాగుతుంది. ఇక్కడ చివరలో ఆర్ట్ తల తెగి పోతుంది. ఆ తర్వాత అతని శరీరంతో విక్టోరియా కలిసి ఆసుపత్రి నుండి తప్పించుకుంటుంది. విక్టోరియా ఆర్ట్ తలకు తిరిగి ప్రాణం పోస్తుంది.

ఐదు సంవత్సరాల తర్వాత, సియన్నా ఆసుపత్రి నుండి విడుదలై తన అత్త జెస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె అత్త భర్త గ్రెగ్, వారి కుమార్తె గబ్బీతో కలిసి ఉంటుంది. ఈ సమయంలో ఆర్ట్, విక్టోరియా మళ్లీ వారి హత్యలకు శ్రీకారం చూడతారు. సియన్నా తన గత గాయాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగానే, ఆర్ట్ ఆమెను మళ్లీ లక్ష్యంగా చేసుకుంటాడు. ఆమె గతంలో తన తండ్రి ఇచ్చిన ఒక ఆయుధంతో ఆర్ట్‌ను ఎదుర్కొంటుంది. ఇప్పుడు విక్టోరియా అతీంద్రియ శక్తులను, సియన్నా దైవిక శక్తులతో ఎదుర్కుంటుంది. చివరికి ఆర్ట్ ను సియన్నా అంతం చేస్తుందా? సియన్నాకి ఉన్న శక్తులు ఏమిటి? వీళ్ళు ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ హారర్ మూవీని చూడండి. ఈ మూవీని ఒంటరిగా మాత్రం చూసే ధైర్యం చేయకండి. భయపెట్టే సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×