E-Paper
Advertisement

కడుపుబ్బా నవ్వించే కామెడీ నుంచి ఏడిపించే ఎమోషన్స్ వరకు… ఒకే ఓటీటీలో 4 తమిళ సినిమాల రచ్చ

కడుపుబ్బా నవ్వించే కామెడీ నుంచి ఏడిపించే ఎమోషన్స్ వరకు… ఒకే ఓటీటీలో 4 తమిళ సినిమాల రచ్చ
Advertisement

Tamil Movies on Netflix OTT: తమిళ సినిమాలు చూడటానికి భాషతో సంబంధం లేకుండా ఇష్టపడే ఆడియన్స్ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సూర్య, విజయ్ సేతుపతి, కీర్తి సురేష్ వంటి స్టార్ల సినిమాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక కథలో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. అలాంటి వారికి Netflix ఒకేసారి నాలుగు విభిన్నమైన తమిళ చిత్రాలతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కామెడీ, క్రైమ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా డిఫరెంట్ జానర్స్‌లో ఉన్న ఈ సినిమాలన్నీ తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉన్నాయి.

1. Dorothy

మొదటగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన ‘డోరోతి’ (Dorothy) గురించి చెప్పుకుందాం. ఈ కథ1990ల కాలం నాటి తమిళనాడు గ్రామీణ వాతావరణంలో కథ సాగుతుంది. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా పెరిగిన ఇద్దరు యువకుల జీవితాల్లోకి డోరోతి అనే మహిళ ప్రవేశిస్తుంది. ఆమె ఆలోచనలు, ఇతరుల పట్ల చూపించే మానవత్వం ఆ ఇద్దరి జీవితాలను, ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చేస్తాయి. అయితే సమాజంలో బలంగా పాతుకుపోయిన వివక్ష, కుల విభేదాలు వారి స్నేహాన్ని కూడా పరీక్షిస్తాయి. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఒకరికొకరు ఎదురుగా నిలబడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి గతంలోని రహస్యాలు, అపార్థాలు బయటపడతాయి. డోరోతి రాకతో మొదలైన మార్పు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.

Advertisement

ఇందులో కీర్తి సురేష్‌తో పాటు సనంత్ (Sananth), రిషికాంత్ (Rishikanth) కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 23 నుంచి Netflixలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో  స్ట్రీమింగ్ అవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమాజంలో ఉండే వివక్ష, పురుషాధిక్య భావజాలం, మనుషుల మధ్య అనుబంధాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా.

2. Modha Rathri

ఇక రెండో సినిమా ‘మొద రాత్రి’ (Modha Rathri). పేరు వినగానే ఏదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనిపించినా.. ఇందులో ఫ్యామిలీ కామెడీ, పెళ్లి తతంగం, ఊహించని ట్విస్టులు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే గందరగోళం సినిమాకు ప్రధాన ఆకర్షణ. రిషికాంత్ (Rishikanth), అనిష్మ అనిల్‌కుమార్ (Anishma Anilkumar) ప్రధాన పాత్రల్లో నటించారు. రాజా కరుప్పసామి (Raja Karuppasamy) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Netflixలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఆడియోలతో అందుబాటులో ఉంది.

Advertisement

ఇద్దరు అపరిచితులు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోవాలని ప్రయత్నిస్తుంది. దీంతో కథ ఒక్క సారిగా మలుపు తిప్పుతుంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పెళ్లి కొడుకు కూడా ఆమెకు సహాయం చేయాలనుకుంటాడు. దీంతో అప్పటివరకు సంతోషంగా సాగుతున్న పెళ్లి వేడుక ఒక్కసారిగా గందరగోళంగా మారుతుంది. మొదటి రాత్రి చుట్టూ అల్లుకున్న ఈ వ్యవహారంలో అమ్మాయి మనసులో ఉన్న అసలు ప్రేమ ఎవరిది? ఆమె తీసుకున్న నిర్ణయానికి కొత్తగా పెళ్లైన భర్త ఎలా స్పందిస్తాడు? ఈ ఇద్దరి వల్ల రెండు కుటుంబాల్లో ఎలాంటి రచ్చ మొదలవుతుంది? అనేది ఈ సినిమాలో చూడాలి.

3. Vishwanath & Sons

మూడో సినిమా సూర్య (Suriya) నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons). దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు (Mamitha Baiju) నటించింది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్ (Radikaa Sarathkumar), రవీనా టాండన్ (Raveena Tandon), నాజర్ (Nassar) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో చూడవచ్చు.

ఇందులో సంజయ్ విశ్వనాథ్ అనే వ్యక్తి జీవితంలో డబ్బుకు, సక్సెస్‌కు కొదవ ఉండదు. ఒలింపిక్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతను తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా గడుపుతుంటాడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు దూరంగా ఉంటూ తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా తన జీవితంలోకి ఒక చిన్నారి రావడంతో అతని ప్రపంచం మారడం మొదలవుతుంది. ఆ బిడ్డకు అవసరమైన సహాయం కోసం అతను అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది.

ఈ ప్రయాణంలో మాడీ జే అనే యువతి పరిచయం అతని జీవితంలో మరో కొత్త మలుపు తీసుకొస్తుంది. ఇద్దరి మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉండటంతో వారి బంధం చుట్టూ అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుంది? కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని ఎలా చూస్తారు? సంజయ్ తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనే అంశాలతో కథ సాగుతుంది.

4. Baththa

ఇక నాలుగో సినిమా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన ‘బత్తా’ (Baththa). బాలాజీ తరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో విజయ్ సేతుపతితో పాటు లిజోమోల్ జోస్ (Lijomol Jose), సాయి పృథ్వీరాజ్ (Sai Prithviraj), సంతి బాలచంద్రన్ (Santhy Balachandran) తదితరులు నటించారు. అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

బత్తా అనే పేరున్న గ్యాంగ్‌స్టర్ అంటే ఆ ప్రాంతంలో అందరికీ భయం. అతను చెప్పిందే అక్కడ చట్టం అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఒక ఎనిమిదేళ్ల చిన్న పిల్లాడు అనుకోకుండా స్కూల్‌లోని పాత టాయిలెట్‌లో బంధిస్తాడు. బయటకు రావడానికి మార్గం లేకపోవడంతో బత్తా అక్కడే చిక్కుకుపోతాడు. అప్పటివరకు తన మాటే శాసనంగా భావించిన గ్యాంగ్‌స్టర్‌కు ఒక చిన్న పిల్లాడి కారణంగా విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆకలి, ఒంటరితనం, నిస్సహాయత మధ్య అతని అసలు వ్యక్తిత్వంలోని మరో కోణం బయటపడుతుంది. ఒకవైపు గ్యాంగ్‌స్టర్ చేసే పనులు, మరోవైపు చిన్న పిల్లాడి అమాయకత్వం మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూనే భావోద్వేగాలను పంచుతాయి. అసలు బత్తా జీవితంలో ఈ సంఘటన ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అతను తన కుటుంబం దగ్గరకు ఎలా చేరుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి.

Read Also: ఒకే రోజు ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జానర్.. వీకెండ్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

 

Tags

Related News

కళ్ళు కనిపించని అమ్మాయికి పెళ్లి.. తన లోపాన్ని దాచేందుకు ఫ్యామిలీ పడే తిప్పలు చూస్తే నవ్వులే నవ్వులు!

ఒకే రోజు ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జానర్.. వీకెండ్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న కొడుకు… దీపావళికి ఇంటికొస్తే దిమ్మతిరిగే షాక్… ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన డ్రామా

ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టేందుకు మాస్టర్ ప్లాన్… అదే టైమ్‌లో పోలీసుల రచ్చ… నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చే కామెడీ క్రైమ్

తండ్రి కోసం కూతురు ఆడిన ఫేక్ పోలీస్ గేమ్… సీన్లోకి అసలు విలన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

అఫీషియల్ జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే!

చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా

Big Stories

Advertisement
×