E-Paper
Advertisement

OTT Movie : కర్ణాటక జనాలని షేక్ చేసిన రియల్ స్టోరీ… గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ హారర్ మూవీని చూడండి

OTT Movie : కర్ణాటక జనాలని షేక్ చేసిన రియల్ స్టోరీ… గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ హారర్ మూవీని చూడండి
Advertisement

OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరికే సినిమాలు అరుదుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నిజానికి ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన హర్రర్ స్టోరీల గురించి ఆడియన్స్ ఆకలి మీద ఉంటారు. అయితే అన్ని సినిమాలు వాళ్లను ఆకట్టుకోలేవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం చూశాక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడంతో పాటు, ఎప్పటికీ ఆ సినిమాను మర్చిపోలేరు కూడా. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా  అలాంటిదే. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరేంటి? దాని కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

యూట్యూబ్ (Youtube) లో

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి కర్ణాటకను షేక్ చేసింది. కర్ణాటక అడవుల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కేస్ అశోక దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ ప్రసాద్, తనూజ, జాను, విజయ్ చందు ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో ఈ మూవీ 2017 ఏప్రిల్ 3న రిలీజ్ అయింది. శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా పేరు చిత్రమ్ కాదు నిజమ్. కన్నడలో ఈ సినిమాను 6-5=2 పేరుతో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ హర్రర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో  ఫ్రీగానే అందుబాటులో ఉంది. పైగా ఈ సినిమాను తెలుగులో కూడా చూడొచ్చు.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

ఫౌండ్ ఫుటేజ్ అనే అంశం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కొంతమంది యూత్ అడవిలోకి ట్రెక్కింగ్ కోసం అని వెళ్తారు. అక్కడ ఒక డాక్యుమెంటరీని తీయాలని ప్లాన్ చేస్తారు. మొత్తానికి అడవిలోని ఎత్తైన శిఖరాన్ని చేరుకోవాలని లక్ష్యంతో నవీన్ కుమార్, సౌమ్య, దీప, ప్రకాష్ అండ్ స్నేహితులు అడవిలోకి బయలుదేరుతారు. అయితే వాళ్లు బయలుదేరినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంటుంది. మరోవైపు అక్కడ భయపెట్టే సంఘటనలు కూడా జరుగుతాయి. మరి ఈ అవాంతరాలన్నీ దాటి వారు శిఖరాన్ని చేరుకున్నారా? తిరిగి ఇంటికి చేరుకోగలిగారా లేదా? అసలు వీళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి దాని నుంచి ఎంతమంది బయటపడ్డారు? అనేది ఈ మూవీ స్టోరీ. 2010లో కర్ణాటకలో జరిగిన రియల్ లైఫ్ స్టోరీ ఇది. అప్పుడు ఈ భయంకరమైన సంఘటన నుంచి బయటపడ్డ ఓ వ్యక్తి దగ్గర దొరికిన కెమెరాలోని ఫుటేజ్ ని తీసుకొని సినిమాగా తెరకెక్కించారు. అయితే ఫుటేజ్ లో ఉన్న రియల్ స్టోరీని ఎలాంటి మార్పులు లేకుండా థియేటర్లలో ఆడియన్స్ కి చూపిస్తామని ప్రమోషన్ చేసారు మేకర్స్. కానీ తీరా థియేటర్ లోకి వెళ్ళాక అదే స్టోరీని వేరే నటీ, నటులను పెట్టి చూపించారు. దీంతో మేకర్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కన్నడలో 30 లక్షల్లో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 5 కోట్లు కొల్లగొట్టింది. వెన్నులో వణుకు పుట్టించే ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాను, మీరు కూడా  చూడాలనుకుంటే, యూట్యూబ్ (Youtube) లో  ఫ్రీగానే అందుబాటులో ఉంది.

Tags

Related News

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

క్రేజీ పోలీసుల పిచ్చి ప్లాన్‌లు… అడుగడుగునా పొట్టచెక్కలయ్యే కామెడీ

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×