E-Paper
Advertisement

Travel Free In Train Bus: బస్సులోనే కాదు రైల్లోనూ ఫ్రీగా వెళ్లొచ్చు, ఇంతకీ ఆ దేశం ఏదంటే?

Travel Free In Train Bus: బస్సులోనే కాదు రైల్లోనూ ఫ్రీగా వెళ్లొచ్చు, ఇంతకీ ఆ దేశం ఏదంటే?
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. అత్యంత వేగంగా ప్రయాణికంచే ఎలక్ట్రిక్ బస్సులు మొదలు గంటకు వందల కిలో మీటర్లు దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. చైనా లాంటి దేశాలు గంటకు 500 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లను ఆవిష్కరించాయి. ప్రజల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. అయితే, ఏ దేశంలోనైనా బస్సు, రైల్లో ప్రయాణించాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఓ దేశంలో మాత్రం ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చు. ఇంతకీ ఆదేశం ఏదంటే?

లక్సెంబర్గ్ లో ఉచిత రవాణా వ్యవస్థ

Advertisement

ఉచిత బస్సు, రైలు ప్రయాణం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం తమ పౌరుల కోసం ఉచితంగా బస్సులు, రైళ్లు నడుపుతున్నది. ఇందులో ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ లేకకపోయినా ఫ్రీగా ప్రయాణం చెయ్యవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అనే మాట వినిపించదు. ఆదేశం మరేదో కాదు లక్సెంబర్గ్.

అత్యంత రిచ్ కంట్రీస్ లో ఒకటి

Advertisement

లక్సెంబర్గ్ యూరప్ ఖండంలోని ఓ భాగం. సంపదకు ప్రసిద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్‌ లో అత్యధిక తలసరి GDPని కలిగి ఉంది ఈ దేశం. ఈయూ తలసరి ఆదాయం సగటున 37 600 యూరోలు ఉంటే, ఈ దేశ తరలసరి ఆదాయం 89 800 కావడం విశేషం. ఇది ఈయూ సగటు కంటే చాలా ఎక్కువ. అంతేకాదు, ఇది ఈయూ మొత్తం GDPలో 0.5% వాటా కలిగి ఉంది. 2024లో IMF ద్వారా ప్రపంచంలోనే అత్యధిక తలసరి జీడీపీ కలిగి ఉన్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. లక్సెంబర్గ్ నగరం బ్యాంకింగ్, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. 2019 మెర్సర్ ప్రపంచ వ్యాప్తంగా 231 నగరాలపై నిర్వహించిన సర్వేలో, ఈ దేశం వ్యక్తిగత భద్రత విషయంలో మొదటి స్థానంలో నిలిచింది.  జీవన నాణ్యత విషయంలో 18వ స్థానంలో నిలిచింది.

Read Also: భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?

2020 నుంచి ఉచిత బస్సు, రైలు ప్రయాణం అమలు

సంపద పరంగా ఉన్నతంగా ఉండటంతో లక్సెంబర్గ్ దేశం తమ పౌరులకు ఉచిత బస్సు, రైలు ప్రయాణాలను అందించాలని నిర్ణయించింది. 2020 సంవత్సరం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉచిత బస్సు, రైలు సౌకర్యాన్ని ప్రజలకు కల్పించింది. ప్రజలు ప్రజా రవాణాను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆ దేశంలోకి మెజారిటీ ప్రజలు ప్రభుత్వ ఉచిత రవాణా వ్యవస్థలను వినియోగించుకుంటున్నారు. ఇక లక్సెంబర్గ్ చూడ్డానికి వచ్చిన విదేశీ పర్యాటకులు కూడా అక్కడ ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎవరికీ ఎలాంటి ఛార్జ్ తీసుకోరు.

Read Also:  నడి సంద్రంలో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యాలా? ఈ షిప్పులో ‘అన్నీ’ చేసుకోవచ్చట!

Related News

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

Big Stories

Advertisement
×