E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. 9 వేల మైళ్లు దాటి అమెజాన్‌కు వెళ్లిన యువతి!

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. 9 వేల మైళ్లు దాటి అమెజాన్‌కు వెళ్లిన యువతి!
Advertisement

From Instagram DM to Amazon Rainforest: ఒక ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్.. ఆ తర్వాత చాటింగ్.. చివరకు వేల మైళ్ల దూరంలో ఉన్న అమెజాన్ అరణ్యానికి ప్రయాణం. ఆస్ట్రేలియాకు చెందిన జోర్డాన్ హౌయెన్‌షీల్డ్, ఈక్వెడార్‌కు చెందిన పిటియురుక్ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందిని ఆకట్టుకుంటోంది.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?

క్వీన్స్‌ లాండ్‌ లోని సన్‌ షైన్ కోస్ట్‌ లో నివసించే జోర్డాన్‌ కు 2023 డిసెంబర్‌ లో పిటియురుక్ పరిచయమయ్యాడు. ఓ రాత్రి ఇన్‌ స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్న సమయంలో ఆమెకు ఈక్వెడార్ అమెజాన్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల పిటియురుక్ ప్రొఫైల్ కనిపించింది. అక్కడి జీవన విధానం, సంస్కృతికి సంబంధించిన అతని పోస్టులు జోర్డాన్‌ను ఆకట్టుకున్నాయి. అతడు తన మెసేజ్‌ కు రిప్లై ఇస్తాడని పెద్దగా ఆశించకపోయినా.. జోర్డాన్ అతనికి డైరెక్ట్ మెసేజ్ పంపింది. అదే వారి ప్రేమకథకు తొలి అడుగుగా మారింది.

గూగుల్ ట్రాన్స్‌ లేట్‌ తో మొదలైన మాటలు

Advertisement

ఇద్దరికీ ఒకరి భాష ఒకరికి తెలియదు. అయినప్పటికీ భాషా సమస్య వారి మధ్య అడ్డంకిగా మారలేదు. గూగుల్ ట్రాన్స్‌ లేట్ సాయంతో ఇద్దరూ రోజూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీడియో కాల్స్ కూడా చేసుకోవడం ప్రారంభించారు.   దాదాపు నాలుగు నెలలు ప్రతిరోజూ మాట్లాడుకున్న తర్వాత జోర్డాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన జాబ్ కు రిజైన్ చేసి, దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరింది. అందులో ఈక్వెడార్‌ ను కూడా చేర్చుకుంది. పిటియురుక్‌ ను ప్రత్యక్షంగా కలవాలనే ఉద్దేశంతో అతడి కుటుంబం నివసించే ప్రాంతానికి వెళ్లింది.

30 గంటల ప్రయాణం తర్వాత అమెజాన్‌కు

ఆస్ట్రేలియా నుంచి ఈక్వెడార్ చేరుకోవడానికి జోర్డాన్ నాలుగు విమానాల్లో 30 గంటలకు పైగా ప్రయాణించింది. అక్కడి నుంచి క్విటో నుంచి పస్తాజా ప్రావిన్స్‌ లోని పిటియురుక్ ఇంటికి మరో ఐదు గంటల బస్సు ప్రయాణం చేసింది. ఇంతకుముందు ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవకపోయినా.. పిటియురుక్‌ను చూసిన తర్వాత తనకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని జోర్డాన్ చెప్పింది. ఇద్దరికీ భాష సరిగ్గా అర్థం కాకపోయినా, మాటల కంటే భావాలు, హావభావాలే ఎక్కువగా మాట్లాడాయని ఆమె వివరించింది. జోర్డాన్ సుమారు రెండు వారాల పాటు పిటియురుక్ కుటుంబంతో కలిసి అమెజాన్ అరణ్యంలో గడిపింది. అక్కడి జీవన విధానాన్ని దగ్గరగా చూసింది. ఉదయాన్నే డప్పుల శబ్దంతో నిద్రలేవడం, కుటుంబంతో కలిసి భోజనం తయారు చేయడం, స్థానిక పొలాలను సందర్శించడం లాంటి అనుభవాలను పొందింది.

ప్రేమకథ వైరల్‌గా మారింది

Advertisement

అమెజాన్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను జోర్డాన్ టిక్‌టాక్‌లో పంచుకోవడంతో ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది వారి వీడియోలను చూశారు. చాలామంది ఈ జంటను అభినందిస్తున్నారు. ఆ తర్వాత ట్రావెల్ కంపెనీ ఫ్లైట్ సెంటర్ జోర్డాన్ ఈక్వెడార్ తిరుగు ప్రయాణానికి స్పాన్సర్ చేయడంతో ఈ జంట మళ్లీ కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పిటియురుక్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ జోర్డాన్‌ తో కలిసి సమయం గడిపాడు. ఆస్ట్రేలియాలోని పబ్‌లు, బీర్, చైనీస్ ఫుడ్ తనకు నచ్చాయని కూడా చెప్పాడు. 2025లో ఈ జంట ‘ది ప్రాజెక్ట్’ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రేమకథ గురించి మాట్లాడారు. భిన్నమైన భాషలు, సంస్కృతులు, దేశాలు తమ మధ్య ఉన్నప్పటికీ.. కలిసి ఉండాలనే కోరిక మాత్రం ఒకటేనని చెప్పారు.

Read Also: జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!

Tags

Related News

చరిత్రలో తొలిసారి.. రైల్లో కాశ్మీర్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరా!

ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు.. విమానంలో హైడ్రామా!

కేరళ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!

జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!

వరదలతో ట్రైన్ క్యాన్సిల్.. రీఫండ్ ఇవ్వని రైల్వేకు భారీ షాక్!

కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!

తత్కాల్ మిస్ అయ్యిందా? చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సీక్రెట్ ట్రిక్ ఇదే!

Big Stories

Advertisement
×