E-Paper
Advertisement

సుజాత లేక బాష్ మిక్సర్ గ్రైండర్.. ఏది కొంటే బెస్ట్ ?

సుజాత లేక బాష్ మిక్సర్ గ్రైండర్.. ఏది కొంటే బెస్ట్ ?
Advertisement

Sujata vs Bosch Mixer Grinder 2026:ఆఫర్‌లో ఒక పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్ కొనాలని చూస్తున్నారా ?అయితే మీ అవసరాలు బడ్జెట్ ను బట్టి ఎలాంటి మోడల్ బెస్ట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. ఇండియన్ మార్కెట్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండే రెండు బ్రాండ్లు ‘సుజాత’ (Sujata), ‘బాష్’ (Bosch) మధ్య పోటీ మామూలుగా ఉండదు. ఎలాంటి పొడులైనా క్షణాల్లో తయారు చేసే ఈ మోడల్స్ కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ రెండింటిలో మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్? ఏ మోడల్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది? అంతే కాకుండా ధరల వివరాలను గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

సుజాత’ VS ‘బాష్’ రెండిట్లో ఏది బెస్ట్ ?

1. Sujata Powermatic Plus Mixer Grinder:

సుజాత అనగానే మనకు గుర్తొచ్చేది దాని అద్భుతమైన లుక్, ఫర్ఫామెన్స్. ఇది 900 వాట్ల బెస్ట్ మోటార్‌తో వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే..నిరంతరం 90 నిమిషాల పాటు ఆగకుండా పని చేయగల సామర్థ్యం దీని సొంతం. దీని సహాయంతో జ్యూసర్లు, చట్నీలు, మసాలాలు నిమిషాల్లోనే మెత్తగా అయిపోతాయి. మార్కెట్లో సుజాత పవర్‌మాటిక్ ప్లస్ మోడల్ ధర సుమారు రూ. 6,500 నుంచి రూ. 7,500 వరకు ఉంటుంది. రోజూ చాలా మందికి వంట చేసే పెద్ద కుటుంబాలకు, జ్యూసులు ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

2. Bosch TrueMixx Pro Mixer Grinder:

Advertisement

జర్మన్ టెక్నాలజీతో తయారయ్యే బాష్ ట్రూమిక్స్ ప్రో మిక్సర్ గ్రైండర్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇవి స్టైలిష్ డిజైన్‌కు ఫేమస్. సాధారణంగా ఇది 750 వాట్ల నుంచి 1000 వాట్ల మోటార్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో ప్రత్యేకమైన లేటెస్ట్ టెక్నాలజీ’ ఉండటం వల్ల అచ్చం రోట్లో రుబ్బినట్లుగానే మసాలాలు తయారవుతాయి. అంతే కాకుండా దీని వైబ్రికా కట్టర్ బ్లేడ్లు చాలా షార్ప్‌గా పని చేస్తాయి. బాష్ ట్రూమిక్స్ ప్రో మోడల్ ధర సుమారు రూ. 5,500 నుంచి రూ. 6,800 మధ్య ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో రుచిగా ఉండే మసాలాలు కోరుకునే వారికి , కిచెన్‌లో సైలెంట్‌గా పని చేసే మిక్సీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Also Read: సగానికి పైగా డిస్కౌంట్‌తో.. అమెజాన్ సేల్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు

Advertisement

ఇక పనితీరు విషయానికి వస్తే.. మోటార్, స్పీడ్ పరంగా సుజాత ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇది చాలా వేగంగా తిరుగుతుంది. బాష్ కూడా బెస్ట్ అయినప్పటికీ, ఇది గ్రైండింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే సౌండ్ విషయానికి వస్తే, సుజాత మోటార్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండటం వల్ల కాస్త ఎక్కువ శబ్దం చేస్తుంది. కానీ బాష్ మిక్సీలు కొంచెం తక్కువ శబ్దంతో.. పనిచేస్తాయి. రెండింటినీ శుభ్రం చేయడం చాలా ఈజీ కాగా, విడిభాగాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

చివరగా చెప్పాలంటే.. మీ ఇంటి అవసరాలను బట్టి సరైన మోడల్‌ను సెలక్ట్ చేసుకోవడం ముఖ్యం.మీకు సూపర్‌ఫాస్ట్ గ్రైండింగ్, జ్యూసింగ్ కావాలంటే సుజాత బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా రోట్లో రుబ్బిన రుచి, పర్ఫెక్ట్ మసాలా గ్రైండింగ్ , ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కోరుకుంటే.. బాష్ వైపు మొగ్గు చూపొచ్చు

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×