E-Paper
Advertisement

హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద గందరగోళం!

హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద గందరగోళం!
Advertisement

HYDRAA Driver Jobs: సరూర్‌నగర్ స్టేడియం వద్ద నిర్వహించిన హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల ఈవెంట్స్ తీవ్ర గందరగోళానికి దారితీశాయి. హైడ్రా చేపట్టిన రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులు వేలాదిగా తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది.

ఉద్యోగాలు తక్కువ.. పోటీ తీవ్రం

Advertisement

హైడ్రా సంస్థ మొత్తం 150 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో 100 DRF అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచే ఈవెంట్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే, కేవలం 150 పోస్టులే ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువతలు తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకే అభ్యర్థులు చేరుకోవడంతో ఒక్కసారిగా స్టేడియం కిక్కిరిసిపోయింది.

కఠినమైన ఈవెంట్స్.. సరైన ఏర్పాట్ల కరువు

Advertisement

ఈ ఉద్యోగాలకు ఎంపికవ్వాలంటే 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్లు విసరాల్సి ఉంది. అయితే జిల్లాలు దాటి వచ్చిన యువతకు అధికారుల నుంచి సరైన ఏర్పాట్లు లభించలేదు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నా కనీసం తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురై ఆందోళనకు దిగారు.

Also Read: మహిళలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కౌంటర్‌గా కేంద్ర మంత్రి చురకలు!

పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

ఒక్కసారిగా జనం పెరిగిపోవడంతో తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. టోకెన్లపై కేటాయించిన సమయం ప్రకారం వచ్చి ఈవెంట్స్‌లో పాల్గొనాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×