E-Paper
Advertisement

ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్

ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్
Advertisement

Survival Action Thriller : యాక్షన్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్లకు ఎక్కువగా హాలీవుడ్ లోనే చూస్తూ ఉంటాము. తెలుగులో ఇలాంటి సినిమాలు వచ్చినా వాటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. అందుకే టాలీవుడ్ మేకర్స్ కూడా అలాంటి సినిమాలను ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలను తీస్తున్నారు. అలా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీనే ‘రేజర్’ (Razor).

ఏ ఓటీటీలో ఉందంటే ?

టాలీవుడ్‌లో సస్పెన్స్, యాక్షన్, రా స్టైల్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రవిబాబు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రేజర్’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి సురేష్ బాబుతో కలిసి నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సైలెంట్‌గా అడుగు పెట్టి వీక్షకులను ఆకట్టుకుంటోంది. జూన్ 19 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. 2 గంటల 4 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్‌తో, హింస, రక్తపాతం, ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ చిత్రం ‘కిల్’, ‘మార్కో’ తరహాలో రూపొందింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

రాష్ట్ర హోం మంత్రి కనకరాజు (వీరయ్య చౌదరి). ఆయనకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏమైనా చేసే మనస్తత్వం అతనిది. దీని కోసం అతను తన కొడుకులతో కలిసి ప్రస్తుత ముఖ్యమంత్రిని దారుణంగా హత్య చేస్తాడు. తరువాత దానిని గుండెపోటుగా చిత్రీకరిస్తాడు. అదే సమయంలో సీఎం ఫామ్‌హౌస్‌ లో సీసీ కెమెరాల రిపేర్ పని చూసే విష్ణు (తనీష్ అల్లాడి) అమర్చిన కెమెరాలో ఈ హత్య రికార్డ్ అవుతుంది.

ఈ విషయం హోం మంత్రి ముఠాకు తెలియడంతో, విష్ణుతో పాటు అతని భార్య (ఇనయా సుల్తానా)ను వారి ఇంట్లోనే అత్యంత పాశవికంగా హత్య చేస్తారు. ఆ హత్యను కళ్లారా చూస్తుంది విష్ణు చిన్న కూతురు తేజు (బేబీ తేజల్ విఖ్యాతి). ఈ హత్యలకు ఏకైక సాక్షి ఆ చిన్న పాపే. ఆ హత్య తాలూకు వీడియో సాక్ష్యం ఎక్కడ ఉందో తెలిసిన ఏకైక వ్యక్తి కూడా ఆ పాప మాత్రమే కావడంతో, హోం మంత్రి కొడుకులు ఆ చిన్నారిని కూడా చంపడానికి వేట మొదలు పెడతారు.

రేజర్ ఎంట్రీ

Advertisement

అదే సమయానికి విష్ణు ఇంట్లోని పెంపుడు కుక్కకు గ్రూమింగ్ చేయడానికి వస్తాడు మొబైల్ పెట్ గ్రూమర్ రుద్ర ప్రతాప్ అలియాస్ రేజర్ (రవిబాబు). నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారిని కాపాడే బాధ్యతను రేజర్ తన భుజాలపై వేసుకుంటాడు. రేజర్ కు ఒక బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. స్పెషల్ ఫోర్సెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రేజర్, అధునాతన టెక్నాలజీ, తన వినాశకరమైన పోరాట పటిమతో హోం మంత్రి పంపిన వందలాది మంది రౌడీలను, ప్రైవేట్ మిలిటరీని ఒంటిచేత్తో ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు. చివరికి ఆ చిన్నారిని ఎలా కాపాడతాడు ? అనేదే సినిమా ఉత్కంఠభరితమైన క్లైమాక్స్.

ఎందుకు చూడాలి ?

రవిబాబు స్టైల్‌లో రా అండ్ రస్టిక్ యాక్షన్, తనీష్ అల్లాడి సరికొత్త లుక్‌తో బలమైన పాత్ర, ఇనయా సుల్తానా, బేబీ తేజల్ విఖ్యాతి రోల్స్ సినిమాలో ప్రధాన బలంగా నిలిచాయి. రాజేష్ ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ను ఎలివేట్ చేసింది. ఆహాలో ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. థియేటర్లలో మిస్ అయిన సస్పెన్స్ అండ్ యాక్షన్ లవర్స్ కోసం ఈ సినిమా పర్ఫెక్ట్ ఓటీటీ ఆప్షన్ అవుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also : తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×