Gundeninda GudiGantalu Today episode January 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తనలో తాను ఫీల్ అవుతాడు ఒంటరినైపోయాయని, ఎక్కడ ఉండేవాణ్ణి ఎక్కడ ఉన్నాను. ఈరోజు మిద్దెపై ఉన్న.. రేపు ఎక్కడ ఉంటానని బాధపడుతూ ఉంటాడు. 40 లక్షల మింగినోడు బాగానే ఉన్నాడు.. ఇంట్లో నుండి లేచిపోయినోడు కూడా బాగున్నాడు… ఇల్లు తాకట్టు బాగున్నారు.. ఎటు వచ్చి.. పూలగంప ముళ్ళగంప.. చిక్కులో పడ్డారు అని తనలో తానే ఫీల్ అవుతాడు. మరోవైపు ప్రభావతి కంగారుపడుతుంది మీనా ను పిలిచి.. అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది.. శృతిని రోహిణి రెడీ చేసి చాలా అందంగా ఉన్నావ్ శృతి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చి చాలా అందంగా ఉన్నావ్ శృతి నా దిష్టి తగిలేలానే ఉంది అని అనగానే ప్రభావతి ఎక్కడికొచ్చి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నేను పూలు పండ్లు పాలు అవన్నీ సిద్ధం చేయమని చెప్పాను కదా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నావ్.. ఆల్రెడీ రోహిణి నీటిగా అందంగా సారీ కట్టింది నువ్వేం పని చెడగొట్టాల్సిన అవసరం లేదని అనగానే శృతి ఎందుకంటే ప్రతిదీ మీ నాన్న అంటారు అంటే మీ నాకు తెలిసినంతగా నాకు తెలియదమ్మా అది అయితే బాగా చేస్తుంది అని మాట మారుస్తుంది.. శోభనానికి రెడీ చేసిన పాలని బాలు తాగేస్తాడు. ప్రభావతి పెద్ద యుద్ధమే చేస్తుంది. రవి బాలు తో మాట్లాడడంతో నీకు శోభనం లేదు ఏమీ లేదని గదికి తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు పాలు తాగడం చూసి ప్రభావతి తమ్ముడు శోభనానికి ఎందుకురా ఇంతగా అడ్డుపడుతున్నావని అంటుంది. ఇంట్లోకి రానీయడమే ఎక్కువ మళ్ళీ ఇదొకట అది కూడా నా రూమ్ లోనే అని అనేసి వెళ్ళిపోతాడు. నేను పైకి వెళ్తున్నాను మీ చావేదో మీరు చావండి అని బాలు పైకి వెళ్ళిపోతాడు. బాలు దగ్గరికి రవి వస్తాడు. చూడగానే బాలు కోపంతో మాట్లాడుతాడు. నీవల్లే ఇదంతా జరిగింది మా పరువును తీసేసావ్ నాన్నకు గుండెపోటు రావడానికి నువ్వే కారణం అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు. కొట్టడానికి ట్రై చేస్తాడు అంతలోకే మనోజ్ వచ్చి రవికి సపోర్ట్ చేస్తాడు.. నీవల్లే ఇంట్లో గొడవలు జరిగేది నువ్వు తాగొచ్చి నాన్నను రెచ్చగొట్టుకున్న అంటే అది జరిగేది కాదు అని మనోజ్ రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది విన్న మనోజ్ ని కూడా కలిపి తిడతాడు. నీకు ఈ రోజు శోభనం కాదురా జరిగేది వేరేది జరుగుతుందని తన గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు బాలు..
మీనా స్వీట్ లన్ని రెడీ చేసి పెట్టేస్తుంది. ఈ బండోడు పాలు తాగినట్లే ఆ స్వీట్లు ఎన్ని తినేసాడు ఏంటో వెళ్లి నేను చూసి వస్తానని ప్రభావతి పైకి వెళ్తుంది. మీనా వాళ్ళ గదికి తాళం వేసి ఉండడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది.. అసలు ఈ తాళం ఎవరేసారు ఎందుకేసారు వాళ్ళు వచ్చే టైం అయింది ముహూర్తానికి టైం అయినప్పుడు ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనా ఏమైనా గదికి తాళం వేసిందని ప్రభావతి మీనా ను అరుస్తుంది. మీనా వచ్చి అసలు గదికి తాళం ఎవరేసారు నేను వేయలేదు అత్తయ్య అనేసి అంటుంది. కానీ ప్రభావతి అస్సలు నమ్మదు. గదిలో శోభనం జరగడానికి ముందుగా ఒప్పుకొని ఇప్పుడు డ్రామాలాడుతున్నావా తాళాలు ఎక్కడ పెట్టావో తీసుకురా అనేసి మీనా పై అరుస్తుంది. నాకేం తెలియదు అత్తయ్య నేను అసలు తాళాలు వేయలేదు నేను మీతో పాటే ఉన్నాను కదా పైకి వచ్చాను అసలు అని మీనా అంటుంది. ఇక అత్త కోడలు ఇద్దరు ఆలోచనలో పడతారు. అసలు గదికి తాళం ఎవరు వేశారని ఆలోచిస్తూ బాలు వేశాడని అనుకుంటారు.
పైన అయిన లేరు మరి తాళం వేసుకొని ఎక్కడికి వెళ్లారో తెలియదు అత్తయ్య అని ఇద్దరు కలిసి ఆలోచనలో పడతారు. ఇక బాలు దగ్గరకెళ్ళి ఎలాగోలాగా తాళం తీసుకొని వస్తారు. తాళం తెరిచి అన్ని సిద్ధం చేస్తారు ప్రభావతి మీనా. ఇక బయటకు వెళ్ళిపోతాడు బాలు.. రవి శృతిలను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రభావతి కిందకు తీసుకొస్తుంది. బాలు ఎక్కడ అంటే బాలు బయట ఉన్నాడు మామయ్య అని మీనా అంటుంది. బాలుని మీనా బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లని ఆశీర్వదించాలి అని సత్యం అంటాడు. అది విన్న బాలు మీరందరూ ఉన్నారు కదా మంచివాళ్లు మీరు ఆశీర్వదిస్తే చాల్లే నేను ఎందుకు అని అనగానే శృతి మీరందరూ ఆశీర్వదించారు కదా ఇంకెవరి ఆశీర్వాదాలు కోసం నేను అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని శృతి అంటుంది. దానికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక బాలు కోపం రెట్టింపు అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో బాలు శృతి పై ఇండైరెక్టుగా సెటైర్లు వేస్తాడు. ఇక ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..