OTT Movie : ఫాంటసీ జానర్‌లో అడ్వెంచర్, హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ నేరేషన్‌తో 2024 లో ఒక యూనిక్ అడిషన్‌గా నిలిచింది. ఈ స్టోరీ ప్రిన్సెస్ ఈవా అనే రాజకుమారి తన తండ్రిని కాపాడేందుకు ఒక మ్యాజికల్ క్రౌన్ కోసం ప్రమాదకరమైన ప్రయాణం చేయడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ప్రిన్సెస్ ఈవా అనే అమ్మాయి, తన తండ్రి కింగ్ షోరాన్‌ని ఒక డెడ్లీ ఇల్నెస్ నుంచి కాపాడేందుకు, మ్యాజికల్ క్రౌన్ కోసం ఒక శాపగ్రస్త రాజ్యంలోకి వెళ్తుంది. ఈ క్రౌన్ ఏ కోరికనైనా తీర్చగల మాయా శక్తి కలిగి ఉంటుంది. కానీ దాన్ని జఫర్ అనే వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. అతనే కింగ్ షోరాన్‌ని కర్స్ చేశాడు. ఈవా జర్నీలో మార్టిన్ అనే బ్లైండ్ బ్లాక్ స్మిత్‌ని కలుస్తుంది. అతను ధైర్యంగా ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఈ రాజ్యం చీకటితో నిండి ఉంటుంది. ఈ ప్రయాణంలో వారు అనేక ప్రమాదకరమైన అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది. ఈ రాజ్యంలో రాక్షస జీవులు, మాయా ఉచ్చులతో వాతావరణం భయంకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈవా, మార్టిన్ మధ్య ఏర్పడే స్నేహం కథకు ఒక ఎమోషనల్ డెప్త్ ని ఇస్తుంది. వీళ్ళు కిరీటాన్ని సంపాదించడానికి దగ్గరగా వచ్చే కొద్దీ, జాఫర్ శక్తులు మరింత తీవ్రమవుతాయి. వీళ్ళ ప్రయాణాన్ని సవాళ్లతో నింపుతాయి.
ఈ కథ ఒక ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఈవా, మార్టిన్ జాఫర్‌తో నేరుగా తలపడతారు. అతను కిరీటాన్ని రక్షిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు. ఈ గొడవలో ఈవా తన లో దాగి ఉన్న శక్తిని కనుగొంటుంది. మార్టిన్ సహాయంతో జాఫర్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఆమె కిరీటాన్ని స్వాధీనం చేసుకుంటుందా ? తన తండ్రిని, రాజ్యాన్ని కాపాడుకుంటుందా ? ఈ కథ ఒక సంతోషకరమైన ముగింపును ఇస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
‘జర్నీ టు కర్స్‌డ్ రియల్మ్’ (A journey to a cursed realm) ఒక ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా. 2024లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ డ్రామా థియేటర్స్‌లో రిలీజ్ కాకుండా, యూట్యూబ్ రీక్యాప్స్‌లో పాపులర్ అయింది. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
Read Also : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే