Vijayasai Reddy : ఏపీ లిక్కర్ ఫైల్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ విచారణలో విజయసాయిరెడ్డి డొంక అంతా కదిలించారు. తన ఇంట్లో రెండుసార్లు జరిగిన మీటింగ్.. అరబిందో నుంచి వైసీపీ నేతలకు వంద కోట్ల రుణం.. రాజ్ కసిరెడ్డి మోసం.. పార్టీలో తన పరిస్థితి.. వరకు అన్ని విషయాలను ఓపెన్‌గా చెప్పారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొత్త పేర్లను సైతం బయటపెట్టారు. కాకపోతే.. జగన్, మిథున్‌రెడ్డిలను సేవ్ చేసే ప్రయత్నం చేశారని.. కేవలం కసిరెర్డి రాజ్‌నే టార్గెట్ చేసేలా వివరాలు చెప్పారని తెలుస్తోంది.
అంతా కసిరెడ్డే చేశాడు..
లిక్కర్ పాలసీపై రెండు మీటింగ్స్ తన ఇంట్లోనే జరిగాయని.. ఆ సమావేశాలకు మిథున్‌రెడ్డి, కసిరెడ్డిలు వచ్చారని విజయసాయిరెడ్డి సీఐడీతో చెప్పారు. మీటింగ్‌లో అయితే తాను ఉన్నానని.. కానీ మద్యం ఆదాయం వాటాల గురించి మాత్రం తనకు తెలీదని చెప్పినట్టు తెలుస్తోంది. కసిరెడ్డి మూడు కంపెనీలను ఏర్పాటు చేసి.. కొత్త మద్యం బ్రాండ్‌లు తయారు చేసి అమ్మిన విషయం తనకు తెలీదన్నారు. మిథున్‌రెడ్డి పాత్ర గురించి కూడా తెలీదంటూ దాటవేశారట విజయసాయిరెడ్డి.
అతను తెలివైన క్రిమినల్
కిక్ బాక్స్ గురించి చర్చించారా? అని సీఐడీ అడిగితే.. తనకు తెలీదని చెప్పానని విజయసాయి అన్నారు. కసిరెడ్డి మద్యం వాటాలు వసూలు చేసి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఐడియా లేదని చెప్పారు. రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడని.. అతను తెలివైన క్రిమినల్ అని అన్నారు. కసిరెడ్డితో జరిపిన ఆర్థిక లావాదేవీలన్నీ అప్పులేనని విజయసాయి చెప్పారు. అరబిందో ఫార్మా నుంచి 100 కోట్లు అప్పుగా ఇప్పించానని.. సీఐడీకి వెల్లడించారు.
Also Read : బెట్టింగ్ యాప్స్‌పై లోకేశ్ యాక్షన్..
నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి..
మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్సార్‌సీపీ పవర్‌లో లేనప్పుడు తాను నెంబర్ 2 స్థానంలో ఉండేవాడినని.. అధికారంలోకి వచ్చాక కోటరి ప్రాధాన్యం పెరిగిపోయి.. తాను 2వేల స్థానానికి పడిపోయానని.. అవమానాల వల్లే తాను పార్టీని వీడానని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాజ్యసభ సీటు కావాలని ఎవరినీ అడగలేదని అన్నారు విజయసాయిరెడ్డి.