BigTV English

OTT Movie : పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనం… ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ లో ట్విస్టులకు మతి పోవాల్సిందే

OTT Movie : పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనం… ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ లో ట్విస్టులకు మతి పోవాల్సిందే

OTT Movie : మలయాళం సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలో ముందుగా మలయాళం సినిమాలకోసం సర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి గత ఏడాది నటించిన బ్రమయుగం, టర్బో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించి, ఓటీటీలో కూడా అదరగొట్టాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఒక మూవీ థియేటర్లలో విడుదలై, డిజిటల్ ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

వినోద్ మీనన్ కొచ్చిలో వ్యాపారవేత్తగా, ఒక స్థాయికి చేరుకుని ఉంటాడు. బెంజమిన్ జోషువా అదే ఊరిలో, ఒక ధైర్యవంతమైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకుని ఉంటాడు. అతను మారు వేషంలో వరుసగా దొంగతనాలు చేస్తున్న, సీరియల్ దొంగల ముఠాను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతను వినోద్ మీనన్ అనే వ్యాపారవేత్త సహాయం తీసుకుని, దొంగను పట్టుకోవడానికి అతనితో కలిసి పనిచేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి కనికరం చూపించని ఆసైకో గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మైండ్ గేమ్‌ ట్రాప్‌ లో పోలీసులను ఆ గ్యాంగ్ లీడర్ తికమక పెడుతుంటాడు. పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనాలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రతి అడుగూ ప్లాన్ ప్రకారం వేస్తుంటారు పోలీసులు.  అతన్ని ఢీ కొట్టే విధంగా తెలివితేటలు ప్రదర్శిస్తాడు వినోద్. చివరికి ఆ సైకోని వినోద్ మీనన్ సాయంతో పోలీసులు పట్టుకుంటారా ? అతడు పోలీసులకు ఎటువంటి సవాళ్ళు విసురుతాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ స్టోరీతో, క్లైమాక్స్ లో వరుసగా వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.


Read Also : పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయి… అబ్బాయిలకు ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ ఎక్స్పీరియన్స్

జీ 5 (Zee 5) లో

ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బజూకా’ (Bazooka). 2025 లో విడుదలైన ఈ మూవీకి డీనో డెన్నిస్ తొలి సారిగా దర్శకత్వం వహించాడు. యోడ్లీ ఫిల్మ్స్, థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ దీనిని నిర్మించాయి.ఇందులో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, షైన్ టామ్ చాకో, హక్కీం షా ప్రధాన పాత్రల్లో నటించారు. మిధున్ ముకుందన్, సయీద్ అబ్బాస్ సంగీతం అందించారు. ఈ స్టోరీ వినోద్ మీనన్ (మమ్ముట్టి), బెంజమిన్ జోషువా (గౌతమ్ వాసుదేవ్ మీనన్) అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జీ 5 (Zee 5) లో మే చివరి వారంలో రాబోతోందని సమాచారం.

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×