Horror Movie OTT : హారర్ గేమ్స్ తయారు చేసే వ్యక్తికి నిజమైన భయం ఇంటి తలుపు తడితే… అతని పరిస్థితి ఎలా ఉంటుంది ? ఓ పాత మట్టి బొమ్మను సాధారణ వస్తువుగానే భావించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాతావరణమే మారిపోతుంది. చిన్న చిన్న విచిత్ర సంఘటనలు క్రమంగా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదంగా మారతాయి. తన గేమ్స్ కోసం భయాన్ని సృష్టించే వ్యక్తే నిజమైన అతీంద్రియ శక్తి దగ్గర చిక్కుకోవడంతో సాగే తైవానీస్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘మడ్‌బోర్న్’ (Mudborn). ఇన్స్టా ను ఊపేస్తున్న ఈ హర్రర్ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
హ్సు-చువాన్ హారర్ వీడియో గేమ్స్ తయారు చేసే వ్యక్తి. భయానక కథలు, వింత జీవులు, అతీంద్రియ శక్తులు అతని రొటీన్ పనిలో భాగమే. గేమ్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి ఎలాంటి సన్నివేశాలు పని చేస్తాయో తెలుసుకోవడంలో అతను దిట్ట. కానీ ఒక పాత మట్టి బొమ్మ అతని చేతికి వచ్చిన తర్వాత అతను సృష్టించే భయానక ప్రపంచానికి, తన నిజ జీవితానికి మధ్య ఉన్న తేడా క్రమంగా చెరిగిపోతుంది. ఓ పాడైపోయిన మట్టి బొమ్మను అతను ఇంటికి తీసుకొస్తాడు. దానిలో ఏ ప్రత్యేకత ఉందో మొదట అతనికి తెలియదు.
దాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత మాత్రం అసాధారణమైన విషయాలు మొదలవుతాయి. కనిపించని శక్తి ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఇంట్లోని మనుషుల ప్రవర్తన కూడా మారుతుంది. మొదట చిన్నగా అనిపించిన సంఘటనలు తర్వాత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. ఆ బొమ్మలో చాలా భయంకరమైన గతం దాగి ఉంటుంది. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఓ ఆత్మకు అది ఒక బంధంలా మారుతుంది. బొమ్మ ఇంట్లోకి రావడంతో ఆ శక్తి మళ్లీ కదలడం మొదలవుతుంది. దాన్ని అర్థం చేసుకునేలోపే హ్సు-చువాన్ జీవితంలో జరుగుతున్న విషయాలు అతని ఊహకు అందకుండా పోతాయి.
ఇక్కడే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. భయాన్ని గేమ్ గా మార్చే వ్యక్తి… ఇప్పుడు తన చుట్టూ జరుగుతున్నదంతా నిజమని గ్రహించాల్సి వస్తుంది. తన దగ్గరున్న వస్తువే తనకు ప్రమాదంగా మారడంతో దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ నిజాన్ని వెతికే కొద్దీ అతను మరింత చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ మట్టి బొమ్మలో ఉన్న ఆత్మ ఎవరిది ? అది ఎందుకు ప్రతీకారం కోరుకుంటోంది ? హ్సు-చువాన్ దాన్ని ఆపగలడా ? అనేది తెలియాలంటే హారర్ గేమ్ మేకర్ ను నిజ జీవితంలోనే ఓ భయంకరమైన ఆటలోకి లాగినట్టుగా సాగే ఈ ‘మడ్‌బోర్న్’ మూవీని చూడాల్సిందే.
Also Read : పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్
‘మడ్‌బోర్న్’ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తైవానీస్ సూపర్ నేచురల్ హారర్ మూవీ. మాండరీన్, ఇంగ్షీషు ఆడియోలు ఉన్నాయి. తెలుగు ఆడియో లేదా తెలుగు సబ్‌టైటిల్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. టోనీ యాంగ్ (Tony Yang), సిసిలియా చోయ్ (Cecilia Choi), డెరిక్ చాంగ్ (Derek Chang) తదితరులు ఇందులో నటించారు.