E-Paper
Advertisement

వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో జపాన్ తరహా హెల్త్ ప్లాన్!

వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో జపాన్ తరహా హెల్త్ ప్లాన్!
Advertisement

Geriatric Healthcare: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ని వృద్ధుల జనాభాకు అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మంత్రిని కలిశారు.

నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్..

ఇటీవల చేపట్టిన జపాన్ స్టడీ టూర్‌కు సంబంధించిన వివరాలను మంత్రికి వారు వివరించారు. జపాన్‌లో వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అక్కడి ప్రజారోగ్య వ్యవస్థ, హాస్పిటళ్లలో అందుతున్న సేవలు, వృద్ధులకు అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలపై మంత్రికి అధికారులు వివరించారు. తక్కువ ఫర్టిలిటీ రేటు, పెరుగుతున్న లైఫ్ ఎక్స్‌పెక్టన్సీ కారణంగా భవిష్యత్తులో తెలంగాణతో పాటు భారత్‌లోనూ వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగే అవకాశాలపై ఇటీవల వెలువడిన అధ్యయనాలపై సమావేశంలో చర్చించారు. ఒకవైపు నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ భారం పెరుగుతుండగా, మరోవైపు వృద్ధుల జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య రంగంపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలని మంత్రి సూచించారు.

Advertisement

Also read: సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

జెరియాట్రిక్ క్లినిక్స్ మరింత స్ట్రాంగ్..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే జెరియాట్రిక్ క్లినిక్స్, పాలియేటివ్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయా సేవల పనితీరును, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన ఆయన, అవసరాలను గుర్తించి జెరియాట్రిక్, పాలియేటివ్ కేర్ సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రజారోగ్య వ్యవస్థను సిద్ధం చేయాలి. వృద్ధుల ఆరోగ్యం, నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరం అని మంత్రి పేర్కొన్నారు.జపాన్ స్టడీ టూర్‌కు సంబంధించిన పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత ఈ అంశంపై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు వెల్లడించారు.

వేతనాల చెల్లింపుపై మంత్రి ఆదేశాలు..

Advertisement

సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యమైన వేతనాల చెల్లింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సానిటేషన్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యార్థుల స్టైఫండ్స్ కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.వేతనాలు, స్టైఫండ్స్ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.

Also read: మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

Tags

Related News

ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్.. కేవలం 3 నెలల్లో రికార్డును బ్రేక్ చేసిన టీజీఎస్ఆర్టీసీ!

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

Big Stories

Advertisement
×