BigTV English
Advertisement

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ నటించిన “అచ్చం మడం నానం పయిర్పు” సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ కథ చెన్నైలోని సాంప్రదాయ తమిళ కుటుంబంలో జీవించే పవిత్ర అనే 19 ఏళ్ల యువతి (అక్షరా హాసన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఒక రాత్రి గడపడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఇది సౌత్ ఆసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్, తస్వీర్ సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది. ఈ స్టోరీ ఏమిటి ? ఈ సినిమా ఎక్కడ ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

పవిత్ర చెన్నైలోని సాంప్రదాయ వెజిటేరియన్ కుటుంబంలో పెరిగిన యువతి. తన తల్లి సౌమ్య, తండ్రి భార్ద్వాజ్ ఆమె మీద ఎక్కువగానే అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆమె కర్ణాటక సంగీత గురువు చారుకేసి వద్ద క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఆమె హరిష్‌ అనే ఒక క్రికెటర్ తో రహస్యంగా డేటింగ్ చేస్తుంది. కానీ ఇంట్లో వాళ్లకు భయపడుతుంటుంది. ఆమె స్నేహితులు జెస్సికా, రతి ఆమె ఆలోచనలను బ్రేక్ చేస్తారు. ఆతరువాత ఆమె నాన్-వెజ్ ఆహారం ఇష్టపడటం, సంగీత కాన్సర్ట్‌లో పాల్గొనడం వంటి చిన్న తిరుగుబాట్లు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. స్నేహితులతో కలసి ఇక అలాంటి టాపిక్స్ కూడా మాట్లాడుకుంటారు. ఇది ఆమెలో యవ్వనంలో వచ్చే కోరికలవైపు మనసు వెళ్లేలా చేస్తుంది.

ఆమె తల్లిదండ్రులు ఒక పని మీద బయటికి వెళ్లినప్పుడు, పవిత్ర హరిష్‌తో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. కానీ కాన్డోమ్ కొనడంలో స్టోర్ ఓనర్ అన్నాచితో జరిగే ఇబ్బందులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు ఆమె ప్లాన్‌ను అయోమయంలో పడేస్తాయి. ఈ సంఘటనల మధ్య, పవిత్ర తన కోరికలు, కుటుంబ నీతులు, సామాజిక ఒత్తిడుల మధ్య ఒత్తిడిని అనుభవిస్తుంది. ఆమె సంగీత కాన్సర్ట్‌లో బిజీగా ఉంటూ, తన ఆలోచనలను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె తన కోరికను తీర్చుకుంటుందా ? మరేమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

“అచ్చం మడం నానం పయిర్పు” (Achcham Madam Naanam Payirppu) 2022లో విడుదలైన తమిళ కామెడీ చిత్రం. దీనిని రాజా రామమూర్తి దర్శకత్వంలో ట్రెండ్‌లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్ (పవిత్ర), ఉషా ఉత్తూప్ (చారుకేసి, సంగీత గురువు), సురేష్ చంద్ర మేనన్ (భార్ద్వాజ్, పవిత్ర తండ్రి), అంజనా జయప్రకాష్ (రతి, స్నేహితురాలు) ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 మార్చి 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా IMDb లో 6.5/10 రేటింగ్ పొందింది.

Read Also : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : మనుషుల్ని మాయం చేసే మిస్డ్ కాల్… హర్రర్ మూవీ లవర్స్ ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

OTT Movie : చంద్రుడు అమాంతం భూమిపై పడిపోతే… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా… మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ

OTT Movie : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

OTT Movie : నగరాన్ని తుడిచిపెట్టే డేంజర్ డిసీజ్… మనుషులను ఆయిల్ లో వేయించి తోలు ఒలిచే సైకోలు… బ్రూటల్ సీన్లు భయ్యా

Big Stories

×