E-Paper
Advertisement

ఎవరు వేటగాడు? ఎవరు బలిపశువు? క్లైమాక్స్ వరకు ఉత్కంఠ కలిగించే సినిమా

ఎవరు వేటగాడు? ఎవరు బలిపశువు? క్లైమాక్స్ వరకు ఉత్కంఠ కలిగించే సినిమా
Advertisement

Action Thriller OTT : ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం వివాదాలతో క్రేజ్ ని సంపాదిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది ఒక హారర్ థ్రిల్లర్ సినిమా. కొంతమంది ధనవంతులు మనుషులను అడవిలో సరదా కోసం వేటాడుతుంటారు. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఇది పొలిటికల్ గా కూడా దుమారం రేపింది. ఇందులో అమెరికన్ పొలిటికల్ పార్టీల గురించి సెటైరికల్ గా చూపించారు. నేరుగా అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ సినిమాపై స్పందించడం విశేషం.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2020లో వచ్చిన ది ఈ యాక్షన్ హారర్ చిత్రం పేరు ‘ది హంట్’ (The Hunt). క్రెయిగ్ జోబెల్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ హారర్ చిత్రాల నిర్మాణ సంస్థ ‘బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్’ నిర్మించింది. అమెరికాలోని రాజకీయ విభేదాలను వ్యంగ్యంగా చూపడం వల్ల ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద వివాదాలకు దారితీసింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సినిమాపై విమర్శలు చేయడంతో, 2019లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి, చివరకు మార్చి 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దురదృష్టవశాత్తూ ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే కరోనా లాక్‌డౌన్ రావడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన తర్వాత దీనికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా కథానాయిక బెట్టీ గిల్పిన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఇది ZEE5, Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక దట్టమైన అడవి ప్రాంతంలో పన్నెండు మంది అపరిచితులు ఒక్కసారిగా కళ్లు తెరుస్తారు. అసలు వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో ఏమాత్రం అర్థం కాదు. అంతలోనే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దూరం నుండి వాళ్ళపై తూటాల వర్షం కురిపిస్తారు. కొంతమంది ధనవంతులు కేవలం వినోదం కోసం మామూలు ప్రజలను ఇలా వేటాడుతుంటారు. ఇక ఒక ఆటలా వేటాడి చంపడమే ఈ హంట్ ఉద్దేశమని బంధీగా వచ్చిన వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది. వేటగాళ్లు ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్న సమయంలో, క్రిస్టల్ అనే మహిళ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది.

ఆమె గతంలో యుద్ధ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో, వేటగాళ్ల ఎత్తుగడలను ముందే పసిగట్టి వారిపైనే ఎదురుదాడి చేస్తుంది. భయంకరమైన ఆయుధాలతో తనను చంపడానికి వచ్చిన వాళ్ళని ఆమె ఒంటరిగా వేటాడటం మొదలుపెడుతుంది. చివరికి ఈ దారుణానికి సూత్రధారి అథీనా అనే మహిళ అని, ఆమె ఇలా చంపడానికి పాత పగలు కారణమని క్రిస్టల్ గుర్తిస్తుంది. ఇక క్రిస్టల్, అథీనాల మధ్య జరిగే పోరాటం చాలా భయంకరంగా సాగుతుంది. చివరకి ఈ పోరులో ఎవరు గెలుస్తారు ? అక్కడి నుంచి ఎంత మంది బ్రతికి బయట పడతారు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇది దెయ్యం కథ కాదు.. కానీ అంతకంటే భయంకరమైన సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×