OTT Movie : దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గానీ సినిమాలలో మాత్రం దయ్యాలను బాగానే చూపిస్తారు. అయితే ఇటువంటి సినిమాలను చూడటానికి ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒంటరిగా చూసే ధైర్యం చాలామందికి ఉండదు. ఎవరైనా తోడు ఉంటేనే ఈ హారర్ సినిమాలను చాలా మంది చూస్తూ ఉంటారు. ఇటువంటి వెన్నులో వణుకు పుట్టించే సినిమాలను, రాత్రిపూట ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. వీటికో ఉండే సన్నివేశాలు అలా ఉంటాయి మరి. మనుషుల్ని భయపెట్టడానికే ఇటువంటి సినిమాలు తీస్తూ ఉంటారు. గత ఏడాది బాలీవుడ్లో వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టింది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సోనీ మాక్స్ (Sony Max) లో
ఈ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అద్భుత్’ (Adbhut). 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ నేరుగా సోనీ మ్యాక్స్ (Sony Max) లో సెప్టెంబర్ 15, 2024 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక పేరు పొందిన డిటెక్టివ్ ని అభినందించడానికి ఒక సభను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అతడు చాలా కేసులను విజయవంతంగా సాల్వ్ చేసి ఉంటాడు. రీసెంట్ గా ఒక డబుల్ మర్డర్ కేసును కూడా సాల్వ్ చేసి పోలీసులకు సహాయంగా నిలుస్తాడు. అతడు తన స్పీచ్ ని తనదైన స్టైల్ లో ఇస్తాడు. స్పీచ్ ఇస్తున్న సమయంలోనే గతంలో అత్యంత కష్టమైన ఒక కేసును తలుచుకుంటాడు. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే.. ఆదిత్య, శృతి డాక్టర్లుగా తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. ఆదిత్య ఒక హాస్పిటల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటాడు. ఆదిత్య హాస్పిటల్ కి వెళ్ళగానే, ఇంట్లో ఉన్న శృతికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కరెంటు లేకపోయినా, మిక్సీ తిరగడం, ఫ్యాను కింద పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సన్నివేశాలకు భయపడి భర్తకి చెప్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక డిటెక్టివ్ని ఆశ్రయిస్తారు. ఆ డిటెక్టివ్ ఇవన్నీ సాధారణంగా జరిగినవి అని అనుకుంటాడు.
అయితే వీళ్లంతా కలిసి ఉన్నప్పుడు ఫ్యాన్ గట్టిగా తిరిగి కింద పడిపోతుంది. అది కూడా ఒక చర్చిలో జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది డిటెక్టివ్ కి ఏదో జరుగుతుందని. ఆ తర్వాత శృతికి ఒకసారి దయ్యం పడుతుంది. గోడమీద నుంచి దూకి రోడ్డుమీద పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమె చాలా భయానక వాతావరణం సృష్టిస్తుంది. త్రుటి లో ఆమె ప్రాణాలని కాపాడుతాడు డిటెక్టివ్. ఆ తర్వాత డిటెక్టివ్ మేరీ అనే అమ్మాయిని ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతనికి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. శృతి ఒక కోమ పేషెంట్ ని చంపి, ఆమె గుండెను ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతురికి అమరుస్తుంది. అప్పటినుంచి చనిపోయిన ఆత్మ వీళ్ళను వెంటాడుతూ ఉంటుంది. చివరికి డిటెక్టివ్ ఈ కేసును సాల్వ్ చేస్తాడా? ఆ దయ్యం వీళ్ళను వదిలి పోతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.