OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే వీటిలో మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మంచి కథలను స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ అనవసరంగా ఒక సమస్యలో పడుతుంది. దాని ద్వారా ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లైవ్’ (Live). 2023 లో వచ్చిన ఈ మలయాళం మూవీకి V. K. ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మమతా మోహన్‌దాస్, సౌబిన్ షాహిర్, షైన్ టామ్ చాకో, ప్రియా ప్రకాష్ వారియర్, కృష్ణ ప్రభ, రేష్మి సోమన్ నటించారు. ఫిల్మ్స్ 24 బ్యానర్‌పై దర్పన్ బంగెజ్జ, నితిన్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ సింప్లీ సౌత్ (Simply south) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే…
అమల ఒక డాక్టర్ గా పనిచేస్తుంటుంది. పేద పిల్లలను చదువుకోడానికి తన వంతు సాయం చేస్తూ ఉంటుంది. సిటీలో ఒక మంచి డాక్టర్ గా పేరు సంపాదించుకుంటుంది. అయితే తన భర్తతో మాత్రం కాస్త విడిగానే ఉంటుంది. వీళ్ళు ఓకే ఇంట్లో ఉన్నా, పేరుకు మాత్రమే భార్య భర్తలు గా ఉంటారు. అయితే యాన అని అమ్మాయి అమలకి పరిచయం అవుతుంది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో, తాతయ్య అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తూ చదివిస్తుంటాడు. ఆమెకు తన వంతు సాయం చేస్తూ ఉంటుంది అమల. ఆమెను డాక్టర్ ను చేయాలనుకుంటుంది. ఒకరోజు అమల ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా, పోలీసులు ఒక ఇంట్లో రైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మసాజ్ పేరుతో కొంతమంది అమ్మాయిలు తప్పుడు పని చేస్తుంటారు. యాన అప్పుడు అదే దారిలో వెళ్తూ ఉంటుంది. ఆమె కూడా వీళ్ళ మనిషే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా యానా మీడియాలో కూడా వస్తుంది.
ఆమెను ఒక మీడియా సంస్థ హైలెట్ చేస్తూ రకరకాల కథలు రాస్తుంది. యాన ఈ విషయంలో చాలా బాధపడుతుంది. ఒక మీడియా ప్రతినిధి టిఆర్పి కోసం ఇదంతా చేస్తాడు. ఆ తర్వాత యాన సమాజంలో చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటుంది. ఒకానొక సమయంలో ఊరు వదిలి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా మీడియా సంస్థ తనని టార్గెట్ చేస్తుంది. చివరికి యాన ఏమవుతుంది? మీడియా ప్రతినిధికి బుద్ధి చెప్తారా? అమల యానాకి ఎలా తోడుగా నిలబడుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, సింప్లీ సౌత్ (Simply south) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లైవ్’ (Live) అనే ఈ మూవీని చూడండి.