BigTV English

OTT Movie : కుక్కర్ లో పిల్లాడి శవం… ప్రియుడితో లేచిపోయే ప్లాన్

OTT Movie : కుక్కర్ లో పిల్లాడి శవం… ప్రియుడితో లేచిపోయే ప్లాన్

OTT Movie : అజీబ్ దాస్తాన్స్’ (Ajeeb Daastaans) 2021లో విడుదలైన ఈ హిందీ ఆంథాలజీ మూవీకి శశాంక్ ఖైతాన్, రాజ్ మెహతా, నీరజ్ ఘైవాన్, కయోజ్ ఇరానీ కలసి దర్శకత్వం వహించారు. ఇందులో నాలుగు విభిన్న షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ మూవీని కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ కలసి నిర్మించారు. ఈ నాలుగు స్టోరీలలో ప్రేమ, ఈర్ష్య, సామాజిక అసమానతలతో ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అజీబ్ దాస్తాన్స్ అనేది ప్రేమ, విశ్వాసఘాతం, సామాజిక అసమానతలు, ఊహించని మలుపులతో కూడిన నాలుగు విభిన్న కథల సమాహారం. ప్రతి కథలోనూ ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

1. మజ్ను (Majnu) – దర్శకుడు: శశాంక్ ఖైతాన్


ఈ కథలో లిపాక్షి అనే యువతి, బబ్లూ అనే ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుంది. ఈ వివాహం రాజకీయ లాభాల కోసం జరిగిన అరేంజ్డ్ మ్యారేజ్. బబ్లూ తన భార్యతో శారీరకంగా గాని, ప్రేమగా గాని దగ్గర కాడు. ఎందుకంటే అతను వేరొకరిని ప్రేమిస్తాడు. లిపాక్షి ఒంటరితనంతో బాధపడుతూ, రాజ్ కుమార్ అనే యువకుడితో సంబంధం పెట్టుకుంటుంది. రాజ్ ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్. బబ్లూ వ్యాపారంలో చేరి లాభాలు తెస్తాడు. కథ చివరిలో ఊహించని మలుపు వస్తుంది, బబ్లూ నిజమైన రహస్యం బయటపడుతుంది.

2. ఖిలౌనా (Khilauna) – దర్శకుడు: రాజ్ మెహతా

మీనల్ అనే ఒక పనిమనిషి, తన చిన్న చెల్లెలు బిన్నీ చదువు కోసం కష్టపడి పనిచేస్తుంది. వారు ఒక చిన్న గదిలో నివసిస్తారు. అక్కడ విద్యుత్ సమస్యలు కూడా ఉంటాయి. మీనల్, సుశీల్ అనే లాండ్రీ వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. వినోద్ అగర్వాల్ అనే సొసైటీ సెక్రటరీ దగ్గర పనిచేయడం ద్వారా విద్యుత్ సమస్యను పరిష్కరించాలనుకుంటుంది. వినోద్ ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తాడు, దీనితో మీనల్ బాధపడుతుంది. కథ చివరిలో బిన్నీ చేసిన ఒక భయంకరమైన చర్య వల్ల అందరూ షాక్ అవుతారు, ఇది సామాజిక అసమానతలను హైలైట్ చేస్తుంది.

3. గీలీ పుచ్చీ (Geeli Pucchi) – దర్శకుడు: నీరజ్ ఘైవాన్

భారతి ఒక ఫ్యాక్టరీ వర్కర్. కుల వివక్షత కారణంగా డేటా ఆపరేటర్ ఉద్యోగం కోల్పోతుంది. ఆ ఉద్యోగం ప్రియా అనే ఉన్నత కుల స్త్రీకి దక్కుతుంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది, కానీ భారతి తన లైంగిక ధోరణిని దాచుకుంటుంది. ప్రియా వివాహం తర్వాత భారతి ఆమె పట్ల ఈర్ష్యతో ఒక పన్నాగం పన్నుతుంది. ఈ కథ కులం, లింగం, గుర్తింపు సంఘర్షణలను లోతుగా చూపిస్తుంది.

4. అన్కహీ (Ankahi) – దర్శకుడు: కయోజ్ ఇరానీ

నతాషా వివాహం అయిన ఒక స్త్రీ.  ఆమె తన భర్తతో సంతోషంగా లేదు. ఆమె కుమార్తె చెవిటిది కావడంతో, సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది. కబీర్  అనే చెవిటి ఫోటోగ్రాఫర్‌తో ఆమెకు పరిచయం అవుతుంది. వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది, కానీ నతాషా తన కుటుంబ బాధ్యతల కారణంగా, ఆ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లలేదు.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×