Gundeninda GudiGantalu Today episode march 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. బంగారం కనిపించలేదని మీనా అనడంతో చంద్రకాంతం అదును చూసి రెచ్చిపోతుంది. అసలు పుస్తెలతాడు కొన్నారో వీడు తాగుడు కి పెట్టుకున్నాడు అనేసి నానా మాటలు అంటుంది. ఇక అందరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడికి శృతి వస్తుంది. అందరూ మా మీనాని తప్పుగా మాట్లాడితే అస్సలు ఒప్పుకోము మా మీన అలాంటిది కాదు. అటు శృతి రోహిణి కూడా మీనా గురించి గొప్పగా అంటారు. కాసేపు పుస్తెలతాడు కోసం పెద్ద రచ్చ జరుగుతుంది ఇక శృతి కారును ఆన్ చేసి కార్లో బాక్స్ చూసి షాక్ అవుతుంది. ఆ గదిలోనే ఉంది నేను వెతుకు తీసుకొచ్చాను అని ఆ పుస్తెలతాడునిస్తుంది.
ఇది ఎక్కడ దొరికిందమ్మా శృతి అని ప్రభావతి అడుగుతుంది. అక్కడే రూమ్లో ఉనింది ఆంటీ అందుకే తీసుకొచ్చి ఇచ్చాను అని అంటుంది. అందరూ మీనానే అంటారు ఎందుకలా అని బాలు కూడా అడుగుతాడు. శృతి చంద్రకాంతంను పక్కకు రమ్మని తీసుకెళ్తుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎందుకె నీకు అంత పొగరు. మా ఆంటీ, అంకుల్ ను అలాగే రాత్రులు కష్టపడి మరి బంగారం కొన్న బాలును అన్ని మాటలు అంటున్నావు. మర్యాదగా ఉండటం రాదా నీకు అని చంద్రకాంతం కు శృతి గడ్డి పెడుతుంది.. మొత్తానికి శృతి దెబ్బకు కాంతం ఫంక్షన్ ను ముందుండి జరిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి వీడియోను అడ్డుపెట్టుకొని చంద్రకాంతని దగ్గరుండి ఫంక్షన్ చేసేలా చేస్తుంది. అటు నీలకంఠం సంజయ్ సడన్ గా అక్కకి ఏమైందని ఆలోచిస్తూ ఉంటారు. చంద్రకాంతం ప్రవర్తన చూసి సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక తప్పక ఆమె చెప్పినట్టు విని అక్కడినుంచి మెల్లగా జారుకుంటాడు. పదండి త్వరగా వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా మౌనికను ఏడిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు అని అంటే దానికి చంద్రకాంతం అయ్యో అలా ఎందుకు అవుతుంది నేను ఉంటాను కదా దగ్గరుండి చూసుకుంటానని అంటుంది. ప్రభావతి ఫ్యామిలీ మాత్రం ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చినప్పటి నుంచి గయ్యాలి లాగా అలా అరుస్తూ ఉన్నది ఇప్పుడు ఏమైందో తెలియలేదే ఇంత సైలెంట్ గా ఇంత బుద్ధిగా మారిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. మౌనిక నువ్వు దగ్గరుండి అందరూ సాగనంపుతారు.
ఇక మీనా రోహిణి ఇంట్లోకి రాగానే అక్కడున్న పని సద్ది పెట్టాలని చూస్తుంటారు అప్పుడే ప్రభావి వచ్చి ఏమైనా ఆగు నువ్వు చేసింది ఏమైనా బాగుందా.. బంగారం జాగ్రత్తగా పెట్టాలని తెలియదా నీకు అని అరుస్తుంది. నేనేం చేశాను అత్తయ్య నన్ను ఎందుకు అంటున్నారు అని అనగానే మొత్తం నువ్వే చేశావు ఆ పుస్తెలతాడు రాగానే నా చేతికి ఇవ్వమని చెప్పాను నువ్వు మాత్రం నా చేతికి ఇవ్వలేదు. ఆయనే కష్టపడి కొన్నాడు కదా నువ్వే గొప్పగా చెప్పుకోవాలని అనుకున్నావు అందుకే ఇవ్వలేదు ఇప్పుడు అందరి ముందు నా పరువు తీసేసావ్ ఆవిడ ఎలా మాట్లాడిందో విన్నావా అనేసి మీనా అని అరుస్తుంది ప్రభావతి.
బాలు వచ్చి ఎవరు నరుస్తున్నారు? ఎందుకు అరుస్తున్నారు? అసలు నా భార్య ఏం చేసింది అని అడుగుతాడు. మొత్తం నీ భార్య చేసింది ఇప్పుడు ఆ పుస్తెలతాడు కనిపించుకున్న అంటే వాళ్ళు ఎంత రాద్ధాంతం చేసే వాళ్ళు నీకు తెలుసా అని బాలుని ప్రభావతి అరుస్తుంది. అంతలోకే శృతి వస్తుంది ఎందుకంటే మీరు ఊరికే ప్రతి చిన్న విషయానికి మీనా పై అరుస్తూ ఉంటారు అని అడుగుతుంది. ఏం తెలియదమ్మా నువ్వు ఊరుకో అనేసి ప్రభావతి అనగానే మీకేం తెలియదు ఆంటీ అసలు ఆ పుస్తెలతాడు కొట్టేసింది ఆ చంద్రకాంతం ఆంటినే.. ఆమె కొట్టేసి కార్లో పెట్టడం నేను తీసిన వీడియోలో కనిపించింది వెంటనే అక్కడికి వెళ్లి తీసుకొచ్చాను అని అనగానే అందరూ షాక్ అవుతారు.
అంటే నేను సాంబార్ పోయకపోయినా ఆవిడే కావాలని సాంబార్ మీద పడేలా చేసుకుని వాష్ రూమ్ కి వెళ్లి అక్కడ కొట్టేసిందేమో అని నేను అంటుంది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది అని శృతి అంటుంది. ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి ఆవిడ ఇలా చేసిందంటే అసలు నమ్మలేకపోతున్నామని రవి రోహిణి కూడా అంటారు. వామ్మో ఇదంతా కావాలని ఆవిడే చేసిందా అని ప్రభావతి అంటుంది. అవునండి ఆమె చేస్తుంది నేను పక్కకు వెళ్లి మాట్లాడిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది మీరు గమనించారా అని అంటుంది. మీరు ప్రతి చిన్న విషయానికి మీ నాన్న అంటే బాగోదండి ముందు మీ నాకు క్షమించమని అడగండి అని అనగానే మరేం పర్లేదు శృతి అత్తయ్య గారే కదా అనేసి నేను అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..