E-Paper
Advertisement

పెళ్లికూతుర్లను ఎత్తుకెళ్ళే రాక్షసుడు… 350 ఏళ్ల పురాతన భవనంలో జరిగే హర్రర్ కామెడీ కథ

పెళ్లికూతుర్లను ఎత్తుకెళ్ళే రాక్షసుడు… 350 ఏళ్ల పురాతన భవనంలో జరిగే హర్రర్ కామెడీ కథ
Advertisement

Horror Comedy OTT : ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్స్‌పై హారర్, యాక్షన్, అడ్వెంచర్ జానర్ చిత్రాల హవా నడుస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ హారర్-కామెడీ ట్రెండ్‌కు సరికొత్త ఊపునిచ్చింది. అదే బాటలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ బాలీవుడ్ మూవీ ‘భూత్ బంగ్లా’ (Bhooth Bangla). థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix లో స్ట్రీమింగ్‌కు వచ్చి నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం

సుమారు రూ.120 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 247 కోట్ల నుండి రూ. 270 కోట్ల వరకు వసూలు చేసింది. బడ్జెట్‌ పై దాదాపు 66 శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టి క్లీన్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటి టబు, మరియు లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి పని చేయడం విశేషం. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బిల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కథలోకి వెళ్తే…

Advertisement

లండన్‌లో నివసిస్తూ, విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోతాడు మన హీరో అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్). అతని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పుల నుండి బయట పడటానికి మార్గం వెతుకుతున్న అతనికి, భారతదేశంలోని మంగళ్‌పూర్ అనే గ్రామంలో తమ పూర్వీకులకు చెందిన 350 ఏళ్ల నాటి పురాతన భవనం (ప్యాలెస్) ఒకటుందని తెలుస్తుంది. ఆ విలువైన ఆస్తిని ఎలాగైనా స్వాధీనం చేసుకుని, తన ఆర్థిక ఇబ్బందులను దాటాలని అర్జున్ ఇండియాకు వస్తాడు.

అదే సమయంలో తన సోదరి మీరా డెస్టినేషన్ వెడ్డింగ్‌ ను కూడా గ్రాండ్‌గా అదే భవనంలో జరిపించాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆ భవనంలోకి అడుగు పెట్టిన అర్జున్‌ కు అక్కడి స్థానికుల నుండి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ కోట కేవలం దెయ్యాల కొంప మాత్రమే కాదు, దానికి ఒక పురాతనమైన శాపం కూడా ఉంది. అక్కడ ‘వధుసూర్’ అనే భయంకరమైన తాంత్రిక శక్తులు కలిగిన రాక్షసుడు తిరుగుతుంటాడు. ఆ గ్రామంలో లేదా ఆ భవనంలో పెళ్లిళ్లు జరిగితే పెళ్లి కూతుళ్లను కిడ్నాప్ చేయడం ఆ శక్తుల నైజం.

Advertisement

అర్జున్ ప్లాన్ చేసిన పెళ్లి వేడుక ప్రారంభం కాగానే, ఆ భవనంలోని క్షుద్ర శక్తులు ఒక్కసారిగా మేల్కొంటాయి. తన సోదరి ప్రాణాలను, తన కుటుంబాన్ని ఆ వధుసూర్ నుండి రక్షించుకోవడానికి అర్జున్ ఏం చేశాడు ? తన పూర్వీకుల డార్క్ ఫ్యామిలీ హిస్టరీ ఏమిటి ? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ వీకెండ్‌లో మంచి హారర్ థ్రిల్లర్‌ ను చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవాలనుకునే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్, డోంట్ మిస్.

Read Also : కంటికి కన్పించని అమ్మాయితో ప్రేమ పెళ్లి… ఖతర్నాక్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×