E-Paper
Advertisement

బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకార దాహంతో రగిలిపోయే ప్రియురాలు… ఇంటెన్స్ రివేంజ్ డ్రామా

బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకార దాహంతో రగిలిపోయే ప్రియురాలు… ఇంటెన్స్ రివేంజ్ డ్రామా
Advertisement

Romantic Thriller Web Series : ఓటీటీ ప్రపంచంలో కొత్త సిరీస్ లు, ఇప్పటికే వచ్చిన సిరీస్ లకు సంబంధించిన నెక్స్ట్ సీజన్‌లు ఇలా విడుదల కాగానే, అలా టాప్ స్థానాల్లో నిలిచి ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. తాజాగా ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ కూడా అలాంటి సిరీస్ ల లిస్ట్ లో చేరిపోయింది. జూన్ 19న విడుదలైన నాలుగు ఎపిసోడ్ల ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ విడుదలైన మొదటి 24 గంటల్లోనే ఓటీటీలో టాప్ 10ను దాటి నెం.1 స్థానం కైవసం చేసుకుంది. ధురందర్ 2, లాఫ్టర్ చెఫ్స్, 24, దృఢం, జాలీ LLB 2 వంటి భారీ హిట్ సినిమాలు, సిరీస్‌లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.

ఎందుకు ఇంత ట్రెండ్ అవుతోంది?

మొదటి సీజన్ 2024లో 19 ఎపిసోడ్లతో మూడు భాగాలుగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సీజన్ 2 మరింత ఉద్వేగంగా, ఎమోషనల్ డెప్త్‌తో వచ్చింది. ఇందులో ప్రేమ, ద్రోహం, రాజకీయాలు, ప్రతీకారం వంటి ఇతివృత్తాలను చాలా స్మార్ట్‌గా, ఉత్కంఠభరితంగా మేళవించి రూపొందించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. IMDbలో 8.2 రేటింగ్‌ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సిరీస్.

Advertisement

మొదటి సీజన్ ఎపిసోడ్‌లు 9.4 నుంచి 9.7 వరకు రేటింగ్‌లు సాధించగా, సీజన్ 2లో అన్ని ఎపిసోడ్‌లు సగటున 9.7కి పైగా రేటింగ్‌లు అందుకున్నాయి. ఇంతటి రేటింగ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సిరీస్.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కలలు, ప్రేమ, వ్యక్తిగత సంఘర్షణలు, సమాజం వేసే ఒత్తిడి మధ్య సాగుతుంది. రెండు సమాంతర కథాంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి, ప్రేమ ఎంత బలమైనదో, ద్రోహం ఎంత భయంకరమైనదో చూపిస్తాయి. పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలు, రాజకీయాలు, ప్రతీకారం అన్నీ చాలా రియలిస్టిక్‌గా, హృదయానికి హత్తుకునేలా చూపించారు. మొదటి సీజన్‌లో మొదలైన కథ రెండవ సీజన్‌లో మరింత లోతుగా, మరింత ఉద్వేగంగా సాగుతుంది.

Advertisement

మొదటి సీజన్‌లో జరిగిన ప్రతీకార పోరాటాల వల్ల షన్విక (సంచిత బసు) తన తండ్రిని, అలాగే భర్త దుష్యంత్‌ను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతుంది. షన్విక జీవితం ఇలా నాశనం అవ్వడానికి ఒక రకంగా తనే కారణమనే తీవ్రమైన అపరాధ భావనతో నలిగిపోతాడు కుల్దీప్ కుమార్ (ధవల్ ఠాకూర్). తను చేసిన తప్పులకు ఏదో ఒక రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆరాటపడతాడు. ఈ సీజన్‌ లో కథ కేవలం ఇద్దరి మధ్య వ్యక్తిగత పగగా కాకుండా, సీతాపూర్‌ను శాసించే పెద్ద రాజకీయ అధికార పోరాటంగా మారుతుంది.

దాదూ ప్రసాద్ (రవి సాహ్) ప్రధాన విలన్‌గా మారి, అధికారం కోసం కొత్త కుతంత్రాలు పన్నుతుంటాడు. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా మారిన షన్వికపై సీతాపూర్‌ లో వరుస దాడులు జరుగుతాయి. ఆమె మాత్రం బాధితురాలిగా మిగిలిపోకుండా, తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవడానికి అత్యంత శక్తివంతమైన, కఠినమైన మహిళగా మారుతుంది. షన్విక పడుతున్న కష్టాలు చూసి, ఆమెకు తోడుగా నిలబడాలని కుల్దీప్ నిర్ణయించుకుంటాడు. “నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే, నా ప్రతీకార పోరాటంలో నాకు తోడుగా ఉండు” అని షన్విక కోరడంతో కథ మలుపు తిరుగుతుంది. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించుకుని, ఆపై శత్రువులుగా మారిన కుల్దీప్, షన్వికలు ఇప్పుడు కలిసి పని చేశారా ? వాళ్ళు శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నారు ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×