Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పుష్ప 2(Pusha 2). డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ వేగంగా చేపట్టారు. ఇక అందులో భాగంగానే ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 నాల్గవ ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అల్లు అర్జున్. హోస్ట్ బాలకృష్ణ (Balakrishna) తో ఎన్నో విషయాలు ముచ్చటించారు అల్లు అర్జున్.
బన్నీ పై స్టార్ డైరెక్టర్స్ ప్రశంసలు..
ఇకపోతే షో లో భాగంగా అల్లు అర్జున్ తన సినీ కెరియర్లో ముఖ్యమైన వాళ్లతో వీడియో బైట్స్ తీయించి, షోలో ప్లే చేయడం జరిగింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ గురించి రాఘవేంద్రరావు (Raghavendra Rao),గుణశేఖర్(Gunasekhar ), దిల్ రాజు(Dilraju ), త్రివిక్రమ్(Trivikram) వంటి దిగ్గజాలు మాట్లాడారు. దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు 100వ సినిమాగా.. అల్లు అర్జున్ మొదటి సినిమాగా ‘గంగోత్రి’ సినిమా విడుదల అయింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అల్లు అర్జున్ లైఫ్ కు మంచి పునాది వేసింది. రాఘవేంద్రరావు ఈ సినిమా గురించి మాట్లాడి..’తగ్గేదేలే’ అంటూ బన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అల్లు అర్జున్ ఆఫీస్ లో ఆయన ఫోటో..
అనంతరం అల్లు అర్జున్ రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ.. “ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఎవరైనా సరే నా ఆఫీస్ లోకి మొదటిగా వస్తే కనిపించేది రాఘవేంద్రరావు ఫోటోనే.. దాని కింద నా ఫస్ట్ డైరెక్టర్ అని కూడా రాసి ఉంటుంది. ఆయనకు నా మనసులో అంతస్థానం ఇచ్చాను కాబట్టి నా ఆఫీసులో ఆయన ఫోటో పెట్టుకున్నాను” అంటూ తెలిపారు. ఇకపోతే బన్నీ మాట్లాడుతూ..” చిన్నప్పుడు నేను డాన్స్ వేస్తుంటే, నన్ను పిలిచి మరీ 100 రూపాయలు ఇచ్చారు. ఆయనే నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి నన్ను హీరోని చేశారు. ఇక నాడు ఆయన నాకు ఇండస్ట్రీలో స్థానం కల్పించి, ప్రోత్సహించారు కాబట్టే ఇప్పటికీ ఆయనను నేను మర్చిపోలేను. అందుకే ఆయన ఎప్పటికీ నా గుండెల్లో అలా నిలిచిపోతారు” అంటూ తెలిపారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావుకి ఎంత ప్రయారిటీ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.
రూ.1000 కోట్లు టార్గెట్..
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. మెగాస్టార్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆ తర్వాత కాలంలో సొంత నటనతో , టాలెంట్ తో పైకి ఎదగాలనుకున్న అల్లు అర్జున్.. మెగా నీడ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కష్టపడుతూ ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఈయన,ఈ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించారు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప -2 కోసం రూ.1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.