BigTV English

IFFI 2024 : గోల్డెన్ పీకాక్ కోసం బరిలో 15 సినిమాలు… అందులో ఇండియన్ సినిమాలెన్నో తెలుసా?

IFFI 2024 : గోల్డెన్ పీకాక్ కోసం బరిలో 15 సినిమాలు… అందులో ఇండియన్ సినిమాలెన్నో తెలుసా?

IFFI 2024 : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) – 2024లో గోల్డెన్ పీకాక్ కోసం 15 అంతర్జాతీయ, మూడు జాతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి ? ఈ అంతర్జాతీయ వేదికపై ప్రీమియర్ కాబోతున్న సినిమాలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియా (IFFI) 2024 కొత్త ఎడిషన్‌లో గోల్డెన్ పీకాక్ టైటిల్ కోసం ఏకంగా 15 సినిమాలు పోటీ పడనున్నాయి. పోటీలో 12 అంతర్జాతీయ సినిమాలు ఉంటే, 3 మాత్రమే భారతీయ చిత్రాలు ఉన్నాయి. ఈ వేదికపై ప్రపంచంలోని  అన్ని చిత్ర సీమల నుంచి, అలాగే భారతీయ చలనచిత్రాలలో అత్యుత్తమమైన చిత్రాలను ప్రదర్శిస్తారు. అయితే అందులో సెలెక్ట్ కావాలంటే సాదాసీదా కథతో వచ్చే సినిమాలకు కష్టమే. IFFIలో సెలెక్ట్ అయ్యే ప్రతి ఒక్క సినిమా మానవ విలువలు, సంస్కృతి, కథ చెప్పే కళకు ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉండాల్సిందే. అలాంటి ప్రత్యేకతను కలిగి IFFI -2024లో ఈ ఏడాది సెలెక్ట్ అయిన చిత్రాలలో కింద ఉన్న ఈ 15 IFFI-2024 అవార్డుకు పోటీ పడుతున్నాయి.

ఇరాన్ మూవీ ‘ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్’,
టర్కీ మూవీ ‘గులిజార్’,
ఫ్రాన్స్ నుంచి ‘హోలీ కౌ’,
స్పెయిన్ నుంచి ‘ఐ యామ్ నేవెంకా’,
యూఎస్ నుంచి ‘పనోప్టికాన్’,
సింగపూర్ మూవీ ‘పియర్స్’,
ట్యునీషియా నుంచి ‘రెడ్ పాత్’, కెనడా,
ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ షెపర్డ్స్’ ,
రొమేనియా మూవీ ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్’,
లిథువేనియా నుంచి ‘టాక్సిక్’,
చెక్ రిపబ్లిక్ మూవీ ‘వేవ్స్’,
ట్యునీషియా అండ్ కెనడా మూవీ ‘హూ డు ఐ బిలోంగ్ టు’.


ఇవి మాత్రమే కాకుండా ఇండియా నుంచి ‘ది గోట్ లైఫ్’, ‘ఆర్టికల్ 370’, ‘రావుసాహెబ్’ సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ సంవత్సరం గోల్డెన్ పీకాక్ జ్యూరీకి భారతీయ చలనచిత్ర నిర్మాత అశుతోష్ గోవారికర్ నేతృత్వం వహిస్తారు. ఆయనతో పాటు సింగపూర్ దర్శకుడు ఆంథోనీ చెన్, స్పానిష్ నిర్మాత ఫ్రాన్ బోర్జియా, బ్రిటిష్-అమెరికన్ నిర్మాత ఎలిజబెత్ కార్ల్‌సన్, ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ ఫిల్మ్ ఎడిటర్ జిల్ బిల్‌కాక్ కూడా ఉన్నారు.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వంటి విభాగాల్లో జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతగా నిలిచిన చిత్రానికి అత్యున్నత పురస్కారం IFFI-2024తో పాటు రూ.40 లక్షల బహుమతి లభిస్తుంది.

IFFI-2024లో ప్రీమియర్ గా ప్రదర్శితం కానున్న సినిమాల లిస్ట్ లో విభిన్న థీమ్‌లు, జానర్‌ల చిత్రాలు ఉన్నాయి, సౌరభ్ శుక్లా ‘జబ్ ఖులీ కితాబ్’ 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వరల్డ్ ప్రీమియర్ కానుంది. హృషికేష్ గుప్తే చిత్రం ‘హజర్వేలా షోలే పర్హీలా గై’ కూడా IFFI-2024 ప్రీమియర్. కాగా 55వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI-2024 నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరగనుంది. ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరగనుంది. మరి ఈసారి IFFI-2024 విన్నర్ గా నిలిచి గోల్డెన్ పీకాక్ ను సొంతం చేసుకునే సినిమా ఏంటో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×