Animated Adventure Series: అడవిలో ఒంటరిగా తిరిగే మోగ్లీకి ఓ వింత మృగం ఎదురైతే? అది మోగ్లీకి హాని చేయకుండా అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే? అసలు ఆ మృగానికి మోగ్లీకి ఉన్న సంబంధం ఏంటి? దాని వెనుక 20 ఏళ్లుగా దాగి ఉన్న రహస్యం ఏంటి? ఇలాంటి క్యూరియాసిటీతో పిల్లలను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే యానిమేషన్ అడ్వెంచర్ సిరీస్ ‘Jungle Tales with Mowgli’ ఇప్పుడు JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మోగ్లీ, అతని స్నేహితులు అడవిలో చేసే కొత్త సాహసాలు, ఎదురయ్యే ప్రమాదాలు, వాటి నుంచి బయటపడే క్రమంలో నేర్చుకునే జీవిత పాఠాలే ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. మరి మోగ్లీకి ఎదురైన ఆ విచిత్రమైన జీవి ఎవరు? అడవిలో మోగ్లీ ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ కథ మోగ్లీ, అతని స్నేహితుల అడ్వెంచర్స్, ప్రమాదాలు, ధైర్యం, స్నేహం, సర్వైవల్ చుట్టూ తిరుగుతుంది. మౌగ్లీ అనే చిన్న బాబు దట్టమైన అడవిలో తోడేళ్ల మధ్య పెరుగుతాడు. అడవిలో దొరికిన ఈ బాబును తోడేళ్ల అమ్మ తన సొంత బిడ్డలా సాకుతుంది. మౌగ్లీకి బలూ అనే ఎలుగుబంటి, బగీరా అనే నల్ల చిరుతపులి మంచి స్నేహితులుగా మారి, అడవిలో ఎలా బతకాలో, జంతువుల భాషను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తాయి. అలా మౌగ్లీ అడవిలో జంతువులతో కలిసి ఎంతో సంతోషంగా, కొమ్మల నుండి కొమ్మలకు దూకుతూ సరదాగా పెరుగుతాడు.
అయితే, క్రూరమైన పులి షేర్ ఖాన్ మౌగ్లీని చంపాలని చూస్తుంటుంది. మనిషి పిల్లవాడు అడవిలో ఉండకూడదని తోడేళ్లను భయపెడుతుంది. చివరికి మౌగ్లీ తన స్నేహితుల సహాయంతో, జంతువులన్నీ భయపడే నిప్పును (ఎర్రటి పువ్వు) తెచ్చి షేర్ ఖాన్‌ను ఎదిరించి అడవి నుండి తరిమికొడతాడు. ఒక్కో అడ్వెంచర్‌లో మోగ్లీకి కొత్త జీవులు పరిచయం అవుతాయి. కొన్నిసార్లు అవే ప్రమాదంగా మారితే, మరికొన్ని సందర్భాల్లో ఊహించని సమయంలో అతనికి సహాయం చేస్తాయి. మోగ్లీ తన స్నేహితులతో కలిసి అడవిలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఎలా బయటపడతాడు? ప్రతి సాహసం అతనికి ఏం నేర్పుతుంది? ధైర్యం, స్నేహం, పరస్పర సహాయం వంటి విలువలను అతను ఎలా అర్థం చేసుకుంటాడు? అనేదే ఈ సిరీస్‌లోని ప్రధాన కథ.
‘Jungle Tales with Mowgli’ కొత్త యానిమేషన్ అడ్వెంచర్ సిరీస్‌గా రూపొందింది. మోగ్లీని మరోసారి కొత్త కథలు, కొత్త సాహసాలతో పిల్లల ముందుకు తీసుకొచ్చారు. ఈ సిరీస్ ఆగస్టు 28, 2026 నుంచి JioHotstarలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లలతో కలిసి చూడటానికి అడ్వెంచర్, యానిమేషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ ఇష్టపడేవారికి ‘Jungle Tales with Mowgli’ మంచి వీకెండ్ ఛాయిస్.