E-Paper
Advertisement

రాత్రికి రాత్రే స్టార్‌డమ్… ఫుట్‌బాల్ లెజెండ్ విన్స్ యంగ్ జీవితం ఎలా నాశనం అయ్యిందో కళ్ళకు కట్టిన సినిమా

రాత్రికి రాత్రే స్టార్‌డమ్… ఫుట్‌బాల్ లెజెండ్ విన్స్ యంగ్ జీవితం ఎలా నాశనం అయ్యిందో కళ్ళకు కట్టిన సినిమా
Advertisement

Sports Documentary on OTT: ఒక్క మ్యాచ్‌తో అమెరికన్ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన యువ స్టార్… కోట్ల డాలర్ల కాంట్రాక్ట్‌తో NFLలోకి అడుగు పెట్టాడు. కానీ స్టార్‌డమ్ ఎంత వేగంగా వచ్చిందో… పతనం కూడా అంతే వేగంగా మొదలైంది. గాయాలు, ఒత్తిడి, కోచ్‌తో విభేదాలు, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అతని జీవితాన్ని ఎలా మార్చేశాయి? అసలు విన్స్ యంగ్ కెరీర్ ఎందుకు ఊహించని మలుపు తిరిగింది ? అతని మాటల్లోనే ఈ ప్రయాణాన్ని చూపించే స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘Untold The Testimony of Vince Young’. మరి ఈ కథలో ఏం జరిగింది ? ఎక్కడ చూడొచ్చు ? ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

టెక్సాస్ లాంగ్‌హార్న్స్‌కు చెందిన విన్స్ యంగ్ చిన్న వయసులోనే కాలేజ్ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారతాడు. ముఖ్యంగా 2006 రోజ్ బౌల్‌లో USCపై టెక్సాస్‌కు 41-38 విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ మ్యాచ్‌లో 267 పాసింగ్ యార్డులు, 200 రషింగ్ యార్డులు, మూడు టచ్‌డౌన్‌లు నమోదు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ విజయంతో విన్స్ యంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. కొద్దికాలానికే NFL డ్రాఫ్ట్‌లో టెన్నెస్సీ టైటాన్స్ అతన్ని మూడో పిక్‌గా ఎంపిక చేసుకుంటుంది.

Advertisement

భవిష్యత్ సూపర్‌స్టార్‌గా అడుగు పెట్టిన అతని కెరీర్ మాత్రం అనుకున్నంత సాఫీగా సాగదు. కొత్త టీమ్, కొత్త కోచ్, భారీ అంచనాలకు తోడు గాయాలు, ఆటపై ఒత్తిడి, కోచ్ జెఫ్ ఫిషర్‌తో విభేదాలు అతని జీవితాన్ని కష్టంగా మారుస్తాయి. అందరికీ టాలెంట్‌డ్ ఆటగాడిగా కనిపించినా… లోపల మాత్రం కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా పోరాడుతుంటాడు. ఈ డాక్యుమెంటరీలో విన్స్ యంగ్ స్వయంగా తన కెరీర్‌లో ఎదురైన ఒత్తిడి, వైఫల్యాలు, వ్యక్తిగత సమస్యలను గుర్తు చేసుకుంటాడు.

కుటుంబ సభ్యులు, మాజీ కోచ్‌లు, సహచరుల అభిప్రాయాలతో అతని ప్రయాణంలోని మరో కోణాన్ని చూపిస్తారు. భారీగా సంపాదించినప్పటికీ ఆర్థిక సమస్యలు కూడా ఎదురై, 2014లో దివాలా కోసం దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. తన జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టుకునేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ చిత్రం చూపిస్తుంది. మరి ఈ స్టార్ కెరీర్ ఎలా పతనం అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఎక్కడ చూడాలి ? తెలుగు డబ్బింగ్ ఉందా ?

Advertisement

జాన్ హెనియన్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సుమారు 1 గంట 18 నిమిషాల నిడివితో సాగుతుంది. ఆగస్టు 25 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీలో ఇంగ్లీష్ ఒరిజినల్‌తో పాటు హిందీ ఆడియో ఉంది. తెలుగు ఆడియో మాత్రం అందుబాటులో లేదు. స్టార్‌డమ్, వైఫల్యం, ఒత్తిడి, మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవడం వంటి అంశాలున్న ఈ నిజ జీవిత కథ మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. డోంట్ మిస్.

Read Also: ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

 

Tags

Related News

కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

పెళ్లయినా తీరని కోరికలు… ఓటీటీలోకి బోల్డ్ ఇంటెన్స్ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీ సిరీస్

టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్

దొంగను పట్టుకోబోయిన ఏజెంట్‌కి చుక్కలు… అడుగడుగునా ట్విస్టులు… ఇదేం కామెడీ భయ్యా

ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్

ఓటీటీలోకి ట్రెండీ యూత్ కామెడీ… ఒకే ఇంట్లో 5 మంది ఫ్రెండ్స్… రూమ్‌మేట్స్ సీక్రెట్స్ బయటపడితే ఇంత రచ్చా?

Big Stories

Advertisement
×