E-Paper
Advertisement

బాలయ్య vs నాగ్.. పాత లెక్కలేంటి? ఈసారి గెలుపెవరిది?

బాలయ్య vs నాగ్.. పాత లెక్కలేంటి? ఈసారి గెలుపెవరిది?
Advertisement

Balayya vs Nagarjuna:బాక్సాఫీస్ బరిలో మరో ఆసక్తికరమైన వార్ జరగబోతుందా.. ప్రస్తుతం వస్తున్న వార్తలను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే వచ్చే డిసెంబర్ 24న నేను వచ్చేస్తున్నా అంటూ ఇప్పటికే అనౌన్స్ చేశాడు బాలయ్య.వీర సింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని తో ప్రస్తుతం జోరుగా సాగుతున్నNBK111సినిమా డిసెంబర్లో వస్తుందని ఇప్పటికే సోషల్ మీడియా ఊదరగొట్టేస్తుంది.

తాజాగా ఇదే రోజున నేను కూడా వచ్చేస్తున్నానంటూ రెడీ అయిపోయాడు కింగ్ నాగార్జున తన వందో సినిమా అయిన కింగ్ 100 ని కూడా ఇదే రోజు తీసుకురానున్నాడట.మొత్తానికి బాక్సాఫీస్ బరిలో మరోసారి నాగ్ మరియు బాలయ్య పోటీ పడబోతున్నారన్నమాట .ఇక ఇదే రోజున బాలీవుడ్ భాద్ షా షారుక్ నటించిన కింగ్ కూడా రాబోతుండడం విశేషం.మొత్తానికి క్రిస్మస్ సీజన్లో మూడు బడా సినిమాలు బరిలో దిగిపోతున్నాయి అన్నమాట.

వీరిద్దరిలో ఎవరు పై చేయి

Advertisement

అయితే బాలయ్య నాగ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కారణంగా తెలుగులో వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.నిజానికి బాలయ్య కన్నా నాగ్ కే ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్.ఎందుకంటే తన కెరీర్ లో వందో మైల్ స్టోన్ గా వస్తున్న సినిమా కింగ్ 100 .దీన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్నాడో చెప్పక్కర్లేదు .అది కూడా తెలుగు దర్శకులను కాదని తమిళ దర్శకుడైన రా కార్తీక్ చేతిలో పెట్టాడు అంటే తన వందో సినిమాని సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్టే.

బాక్సాఫీస్ వద్ద పది సార్లు డీ అంటే డీ

అయితే మరోవైపు బాలయ్యని కూడా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.ఇదే డిసెంబర్లో బాలయ్యకి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా డిసెంబర్లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ బరిలో దిగి ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లదు.

Advertisement

అయితే నాగార్జున, బాలయ్య ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో గతంలో వీరి మధ్య జరిగిన బాక్సాఫీస్ వార్ ఇప్పుడు చర్చల్లోకి వస్తుంది.వీరిద్దరి బాక్సాఫీస్ వార్ ని ఒకసారి చూస్తే ఇప్పటివరకు బాలయ్య నాగార్జునలు ఇద్దరు దాదాపు బాక్సాఫీస్ వద్ద పది సార్లు డీ అంటే డీ అంటూ బరిలోకి దిగారు.

భార్గవ రాముడు VS మజ్ను

మొదటిసారి 1987 సంక్రాంతి బరిలో బాలయ్య భార్గవ రాముడు అనే సినిమాతో జనవరి 14న బరిలోకి దిగితే, అదే పొంగల్ బరిలో నాగ్ తన మజ్ను సినిమాతో దిగాడు .అయితే బాలయ్య భార్గవ రాముడు సినిమా సీమలో మంచి విజయాన్ని సాధిస్తే మజ్ను మాత్రం ఆంధ్రాలో మంచి కలెక్షన్లను రాబట్టింది.

కలెక్టర్ గారి అబ్బాయి VS సాహస సామ్రాట్

ఇక అదే ఏడు ఏప్రిల్ లో నాగ్, ఏఎన్ఆర్ కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి సూపర్ హిట్ కాగా, బాలయ్య సాహస సామ్రాట్ మాత్రం డిజాస్టర్ మూటకట్టుకుంది.ఇక అదే ఏడు నవంబర్లో నాగార్జున కిరాయి దాదాతో బరిలోకి దిగితే ,బాలయ్య భానుమతి గారి మొగుడు సినిమాతో పోటీపడ్డాడు.ఇక ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడం విశేషం.

ఇక 1988 లో నాగార్జున చినబాబు సినిమాతో బరిలోకి దిగితే, బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ అంటూ పోటీపడ్డాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. ఇక 1989లో బాలయ్య అక్టోబర్లో బాలగోపాలుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టేస్తే వారానికి ముందుగా అంటే అక్టోబర్ 5న వచ్చిన శివ సినిమా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో చెప్పక్కర్లేదు.

also read :కాకా కథ ఇదేనా …మెగా 158 స్టోరీ లీక్ ?

తల్లిదండ్రులు VS నిర్ణయం

ఇక 91లో బాలయ్య తల్లిదండ్రులు తో సూపర్ హిట్ కొట్టగా నాగార్జున నిర్ణయం సినిమాతో యావరేజిని మూట కట్టుకున్నాడు. ఇక 1994లో ఏప్రిల్ 14న బాలయ్య భైరవద్వీపంతో సూపర్ హిట్ కొట్టగా, నాగార్జున హలో బ్రదర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది . అయితే ఈ రెండింటిలో భైరవద్వీపం సినిమా ఎవర్ గ్రీన్ హిట్ నిలవడం విశేషం.

డిక్టేటర్ VS సోగ్గాడే చిన్నినాయన

ఇక 1996లో సంక్రాంతికి బాలయ్య వంశానికొక్కడు సినిమాతో ఎంట్రీ ఇస్తే నాగార్జున వజ్రం సినిమాతో బరిలోకి దిగాడు రెండింటిలో వంశానికొక్కడు యావరేజ్ గా నిలిచింది ,ఇక వజ్రం సంగతి చెప్పక్కర్లేదు .2004లో బాలయ్య డిసెంబర్లో విజయేంద్ర వర్మతో బరిలోకి దిగితే నాగ్ మాస్ సినిమాతో పోటీపడ్డాడు. రెండింటిలో మాస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక చివరగా 2016లో బాలయ్య సంక్రాంతి బరిలో డిక్టేటర్ తో పోటీ పడితే నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాతో డీ కొట్టాడు.

also read :సూరికి హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?

ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో

ఈ రెండింటిలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే .మొత్తంగా బాలయ్య నాగార్జునల మధ్య ప్రతిసారి బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగానే సాగింది అని చెప్పాలి .మరి ఈ వచ్చే డిసెంబర్ సీజన్లో ఇద్దరిలో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో వేచి చూడాల్సిందే!

Tags

Related News

రూ. 300 కోట్ల రికార్డుకు ఎసరు పెట్టిన ‘బెత్లెహెం’

ఇరుముడి దెబ్బకు రవితేజ పాత రికార్డులన్నీ గల్లంతే!

ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

సూరికి హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?

నా బిడ్డకు మీరే పేరు పెట్టండి… ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సమంత!

కాకా కథ ఇదేనా …మెగా 158 స్టోరీ లీక్ ?

కోర్టు ఫేం హర్ష రోషన్ “తెల్ల కాగితం” రిలీజ్ డేట్ ఫిక్స్..ఇలా కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×