E-Paper
Advertisement

ఇరుముడి దెబ్బకు రవితేజ పాత రికార్డులన్నీ గల్లంతే!

ఇరుముడి దెబ్బకు రవితేజ పాత రికార్డులన్నీ గల్లంతే!
Advertisement

Irudu Mudi Box Offic:ఇరుముడి.. ఇరుముడి.. ఇరుముడి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే.రవితేజ హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్న, ఎక్కడ మాట్లాడినా.. ఈ పేరు గురించే.

ఇక సినిమా మొదటి రోజు ఊహించని విధంగా ఏకంగా 14 కోట్లను వసూలు చేయడంతో రవితేజ గత సినిమాలు మొదటి రోజు ఎంతెంత వసూలు చేశాయా అంటూ అరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.

ఓపెనింగ్స్ విషయానికి వస్తే

Advertisement

రవితేజ గత సినిమాలో ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఇరుముడికి ముందు రవితేజ నటించిన క్రాక్ సినిమా దాదాపు తొమ్మిది కోట్ల 80 లక్షల రూపాయలతో బాక్సాఫీస్ బెస్ట్ ఓపెనర్ గా నిలువగా, అంతకుముందు మాస్ జాతర అనే సినిమా 7కోట్ల 50 లక్షల రూపాయలతో రెండో స్థానాన్ని కొట్టేసింది.ఇక ఖిలాడి సినిమా 6 కోట్ల 50 లక్షలని కొల్లగొడితే, ధమాకా సినిమా ఆరుకోట్ల 90 లక్షల రూపాయలని వెనకేసింది.

ఇక టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా 6 కోట్ల 40 లక్షలని తన ఖాతాలో వేసుకుంటే, ఈగల్ సినిమా 6 కోట్ల 10 లక్షల రూపాయలని బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది .ఇక రావణాసుర అనే సినిమా దాదాపు 6 కోట్ల రూపాయలని మొదటి రోజు సొంతం చేసుకోగా, మిస్టర్ బచ్చన్ సినిమా ఐదు కోట్ల 30 లక్షల రూపాయలని కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.

మొదటి స్థానాన్ని కబ్జా చేసిన ఇరుముడి

Advertisement

మొత్తంగా ఇరుముడి అనే సినిమా 14 కోట్ల 80 లక్షలతో మొదటి స్థానాన్ని కబ్జా చేయగా రెండో స్థానంలో క్రాక్ సినిమా నిలిచిందన్నమాట. అంటే క్రాక్ సినిమా కంటే దాదాపు 40% ఎక్కువ వసూల్లని  కొల్లగొట్టింది ఇరుముడి సినిమా.ఇక సినిమా రోజు గడుసున్నకొద్దీ సాలిడ్ వసూల్లని వెనకేస్తుండటంతో ఈ సినిమా ఈజీగానే 200 కోట్లు వెనకేస్తుందంటూ లెక్కలు కడుతున్నారు ట్రేడ్ పండితులు .

also read :బాలయ్య vs నాగ్.. పాత లెక్కలేంటి? ఈసారి గెలుపెవరిది?

ఎలాంటి రికార్డులని ఖాతాలో వేసుకుంటాడో

మరి ఒకవైపు టాక్సిక్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, మరోవైపు విడుదలైన ఏ  సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడంతో రవితేజ సినిమా ఈజీగానే మరిన్ని వసూల్లని సొంతం చేసుకోబోతున్నాడు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మొత్తంగా ఇరుముడి అనే సినిమా ఇరగదీస్తుండటం చూస్తుంటే రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టేలా ఉంది. చూడాలి ముందు ముందు ఎలాంటి రికార్డులని రవితేజ తన ఖాతాలో వేసుకుంటాడో !

Tags

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×