E-Paper
Advertisement

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

Animated movie on OTT : ఒకప్పుడు బోనీకి తన బొమ్మలే ప్రపంచం. వుడీ, బజ్, జెస్సీతో ఆడుకుంటూ రోజంతా గడిపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చేతిలో బొమ్మ ఉండాల్సిన చోట మొబైల్, టాబ్లెట్ వచ్చేశాయి. స్క్రీన్ ప్రపంచంలోకి వెళ్లిపోయిన బోనీకి… తన చిన్ననాటి బొమ్మలు అవసరం లేకుండా పోతే? ఆ బొమ్మల ఉనికే ప్రమాదంలో పడితే? అంతేకాదు, ఓ కొత్త టెక్నాలజీ వాళ్ల జీవితాల్లోకి వచ్చి అసలు బోనీని పూర్తిగా మార్చేస్తే? మళ్లీ ఆ చిన్నారి మనసులో తమకు చోటు సంపాదించుకోవడానికి వుడీ, బజ్ ఏం చేశారు? ఇదే ఆసక్తికరమైన కథతో వచ్చిన మూవీ ‘టాయ్ స్టోరీ 5’ (Toy Story 5). థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చింది ? ఈ మూవీ స్ట్రీమింగ్ విషయంలో చోటు చేసుకున్న ఆ ట్విస్ట్ ఏంటి ? అన్నది చూద్దాం.

కథలోకి వెళ్తే…

కథలో బోనీ ఇప్పుడు కాస్త పెద్దదవుతుంది. చిన్నప్పుడు వుడీ, బజ్, జెస్సీతో ఆడుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. కానీ వయసు పెరిగేకొద్దీ ఆమె దృష్టి బొమ్మల నుంచి టెక్నాలజీ వైపు మళ్లుతుంది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి. దీంతో తన దగ్గరున్న పాత బొమ్మలను బోనీ క్రమంగా పక్కన పెట్టేస్తుంది.

Advertisement

అలాంటి సమయంలో బోనీ ఇంట్లోకి లిలీప్యాడ్ అనే కొత్త టాబ్లెట్ వస్తుంది. ఇది మామూలు గ్యాడ్జెట్ కాదు. పిల్లల ఆసక్తిని అర్థం చేసుకుని, వాళ్లను ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచేలా పని చేసే తెలివైన డిజిటల్ పరికరం. బోనీ దానిలో పూర్తిగా మునిగిపోవడంతో వుడీ, బజ్, జెస్సీ తమ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోలేకపోతారు.

ఇదంతా జరుగుతుండగానే మరో సమస్య మొదలవుతుంది. ఓ షిప్పింగ్ కంటైనర్ నుంచి పొరపాటున 50కి పైగా బజ్ లైట్‌ఇయర్ బొమ్మలు బయటకు వస్తాయి. వాటికి తాము బొమ్మలమనే విషయం తెలియదు. నిజమైన స్పేస్ కమాండర్లమని నమ్ముతూ ఇంట్లో హడావుడి చేస్తుంటాయి. దీంతో అసలు బజ్‌కే తలనొప్పి మొదలవుతుంది.

Advertisement

మరోవైపు లిలీప్యాడ్ ప్రభావంతో బోనీ నిజమైన ఆటలకంటే డిజిటల్ ప్రపంచానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తమతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఆమె మర్చిపోతుందేమోనని వుడీ బాధపడతాడు. బజ్‌తో కలిసి బోనీకి బొమ్మల విలువను మళ్లీ గుర్తుచేయడానికి ఓ ప్లాన్ వేస్తాడు.

చివరికి బోనీ జీవితంలో టెక్నాలజీని పూర్తిగా దూరం చేయడం పరిష్కారం కాదని వుడీ, బజ్ గ్రహిస్తారు. మరి ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తిరిగింది ? స్క్రీన్‌కు పూర్తిగా బానిస కాకుండా, టెక్నాలజీతో పాటు నిజమైన అనుబంధాలకు కూడా సమయం కేటాయించడం బోనీ ఎలా నేర్చుకుంది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.

తెలుగులో ఏ ఓటీటీలో ఉంది ?

‘టాయ్ స్టోరీ 5’ ప్రస్తుతం డిజిటల్ రెంట్ రూపంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో చూడొచ్చు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 42 నిమిషాలు. దర్శకుడు ఆండ్రూ స్టాంటన్ కాగా, వుడీకి టామ్ హాంక్స్, బజ్‌కు టిమ్ అలెన్ వాయిస్ అందించారు.

Read Also: గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×