E-Paper
Advertisement

షూటింగ్‌లో లేట్, సెట్‌లో ఫోన్.. అసలు విషయాలు కక్కేసిన సెలబ్రిటీలు

షూటింగ్‌లో లేట్, సెట్‌లో ఫోన్.. అసలు విషయాలు కక్కేసిన సెలబ్రిటీలు
Advertisement

Siddu Jonnalagadda :అమెరికాలో ‘చెఫ్ మంత్ర’ టీమ్ తెగ సందడి చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సారి షోలో  కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటకు వచ్చి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా షూటింగ్ టైమింగ్స్, సెట్‌లో ఫోన్ వాడకం, డైట్, ఫ్రెండ్‌షిప్స్ గురించి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అందాల భామలు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఓపెన్‌గా మాట్లాడిన మాటలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

షో మొదలైన మొదట్లోనే యాంకర్ ప్రశ్నలు అడగడానికి ముందే ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు ప్రశ్నలు నెట్టేసుకుంటూ ఫన్ క్రియేట్ చేయడం విశేషం. “ముందు మీరు చెప్పండి” అంటూ ఒకరినొకరు ఇరికించే ప్రయత్నం చేయడంతో షో అంతా ఒక్కసారిగా ఘోల్లుమంది.ఇక చివరికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పక తప్పకపోవడంతో ఇలా అసలు విషయాలు చెప్పుకొచ్చారు.

ఒప్పేసుకున్న సిద్దు 

Advertisement

సెట్‌కి ఎప్పుడు వస్తారు అన్న ప్రశ్న రాగానే “టైమ్‌కే వస్తాం” అని నవ్వుతూ చెప్పారు. ఫస్ట్ షాట్ ఉదయం 8.45 గంటలకు అని షెడ్యూల్ చేసినా, తాము మాత్రం 9.30 నుంచి 9.45 మధ్యలో వచ్చే సందర్భాలు ఉంటాయని సరదాగా ఒప్పుకున్నారు సిద్దు జొన్నలగడ్డ . నిజానికి సినిమా షూటింగ్ అంటే కేవలం కెమెరా ముందుకు రావడం మాత్రమే కాదని.. కాల్‌షీట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, రిహార్సల్స్ ఇలా ఎన్నో పనులు ఉంటాయని, సెలబ్రిటీల లైఫ్ బయటకు కనిపించేంత సింపుల్‌గా ఉండదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఈ కుర్ర హీరో.

సెట్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లోనే ఎక్కువ

ఇక షూటింగ్ సెట్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లోనే ఎక్కువ సమయం ఎవరు గడుపుతుంటారని అడిగిన ప్రశ్న కి సిద్దు, రాశీ ఇద్దరు శ్రీనిధి వైపే చూపించడం విశేషం.దానికి శ్రీనిధి ఆన్సర్ ఇస్తూ సెట్‌లో తనకు కంపెనీ ఇచ్చేవారు ఎవరూ లేకపోవడం వల్లే ఫోన్ వాడుతుంటానని చెప్పడం నవ్వులు పూయించింది.

ఎవరు ఎక్కువ డైట్ లో ఉంటారంటే 

Advertisement

ఇక మరోవైపు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, సిద్దుల ఫుడ్ హ్యాబిట్స్, ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఎవరు ఎక్కువ డైట్ లో ఉంటారు అన్న ప్రశ్నకి , శ్రీనిధి శెట్టి, సిద్దు ఇద్దరు రాశీ ఖన్నా వైపు చూపిస్తూ రాశీ కన్నా డైట్ లో ఉండటం కాదని డైటే రాశీ ఖన్నా లో ఉంటుందని అనడంతో ఒక్కసారిగా అందరు నవ్వేశారు.

ఇక ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న ప్రశ్నకి శ్రీనిధి రాశీ ఖన్నాకి గులాభి పువ్వు ఇవ్వగా, సిద్దు మాత్రం ఎవరైనా ఈ విషయాన్ని పబ్లిక్ లో చెబుతారా అంటూనే ఐ లైక్ టూ అంటూ తెలివిగా తప్పించుకున్నాడు.

also read :శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

మొత్తంగా సినిమాల్లో పర్ఫెక్ట్ లుక్ కోసం బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఫుడ్, వర్కౌట్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హెల్తీ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతున్నామని నటీనటులు చెప్పుకురావడం విశేషం.

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×