E-Paper
Advertisement

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

CM Revanth Reddy: రాష్టంలో 22A అంశం పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలు పుకార్లు.. కట్టుకథలు నమ్మవద్దని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజలు తమ భూమి హక్కు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులు. మీడిటర్స్ ని ఆశ్రయించవద్దు అని సీఎం స్పష్టం చేశారు.

22-ఏ నిషేధిత భూములు..

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

Advertisement

Also Read: కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

త‌ప్పులు లేకుండా..

రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేస్తారన్నారు. జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తారని సీఎం స్పష్టం చేశారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు.

ఇబ్బంది రానివ్వం..

Advertisement

ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదని, ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని స్ఫష్టం చేశారు. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వం అని, 22-ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని సీఎం తెలిపారు. ఎటువంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దని అన్నారు.

Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×