OTT Movie : మంచి కంటెంట్ ఉంటే, ఎటువంటి సినిమాలను అయినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. భాషతో సంబంధం లేకుండా వీటిని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సినిమా రంగంలో పేరు తెచ్చుకోవాలని కలలు కనే యువకుడు, అనుకోని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రకాశన్ నివసిస్తూ ఉంటాడు. ఇతడు సినిమా దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. ప్రకాశన్ ప్రతిభావంతుడైన నాటక రచయిత కావడంతో,అతని స్నేహితులు అతన్ని సినిమా రంగంలో పేరు సంపాదించిన తన స్నేహితుడు కిచ్చు (రూపేష్ పీతాంబరన్) ని కలవమని ప్రోత్సహిస్తారు. మొదట ప్రకాశన్ భార్య ఇందుకు ఒప్పుకోకపోయినా,తరువాత అతికష్టం మీద ఒప్పిస్తాడు.ఇక భార్యా పిల్లలను గ్రామంలో వదిలి, ప్రకాశన్ కొచ్చికి వెళ్తాడు. కానీ అక్కడ కిచ్చు జీవనశైలి, పరిస్థితులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రకాశన్. కిచ్చు ఊరిలో చెప్పిందోకటి, కొచ్చిలో చేస్తుంది ఒకటిగా ఉంటుంది. అతను చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతుంటాడు.
ఇప్పుడు ప్రకాశన్ కి పరిస్థితులతో కలిసిపోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. ఇక కొచ్చిలో కిచ్చుతో పాటు ప్రకాశన్ ప్రయాణం మొదలౌతుంది. వీళ్ళకు తోడు మరో ఇద్దరు కూడా ఉంటారు. వీళ్ళ స్టోరీలు ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటాయి. ఉన్నట్టుండి వీళ్ళ జీవితాలు ఒక బ్యాగ్ కారణంగా ఊహించని మలుపులు తిరుగుతాయి. చివరికి వీళ్ళకు దొరికిన బ్యాగ్ లో ఏముంది ? ఎందుకు దాని కోసం పరుగులు పెడుతున్నారు ? వీళ్ళు సినీ రంగంలో గొప్పవాళ్ళు అవుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అబ్బురపరిచే ఫ్యాంటసీ థ్రిల్లర్… నెవర్ బిఫోర్ సీన్స్ మావా
జీ 5 (Zee 5) లో
ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘అంకరాజ్యాతె జిమ్మన్మార్’ (Ankarajyatha jimmanmaar). 2018 లో వచ్చిన లో వచ్చిన ఈ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో రోనీ డేవిడ్ రాజ్, రాజీవ్ పిళ్ళై, సుదేవ్ నాయర్, అను మోహన్, వినీతా కోషి వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రధానంగా ప్రకాశన్ (రోనీ డేవిడ్ రాజ్) అనే గ్రామీణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. జీ 5 (Zee 5) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.