BigTV English
Advertisement

OTT Movie : పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అబ్బురపరిచే ఫ్యాంటసీ థ్రిల్లర్… నెవర్ బిఫోర్ సీన్స్ మావా

OTT Movie : పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అబ్బురపరిచే ఫ్యాంటసీ థ్రిల్లర్… నెవర్ బిఫోర్ సీన్స్ మావా

OTT Movie :  టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇటువంటి జోనర్ లో ఎన్నో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, టైం ట్రావెల్ ప్రాజెక్టులో ఉన్న ఒక సైంటిస్ట్ అదృశ్యంతో స్టార్ట్ అవుతుంది. అతన్ని వెతకడంలో ఎన్నో ట్విస్ట్ లు ఎదురౌతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

మెగ్ మర్రి అనే యువతి తండ్రి అలెక్స్ మర్రి ఒక శాస్త్రవేత్తగా ఉంటాడు. అతడు గత కొన్ని సంవత్సరాలుగా అనుమానాస్పదంగా కనిపించకుండా పోతాడు. ఇతను ఒక టైం ట్రావెల్ ప్రాజెక్ట్ మీద పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతను మిస్సింగ్ అవుతాడు. అయితే మేగ్ తన తండ్రిని వెతకడానికి తన తమ్ముడితో కలసి బయలుదేరుతుంది. ఈ క్రమంలో వీళ్ళు ముగ్గురు మంత్రగత్తెలను (మిసెస్ విచ్, మిసెస్ వాట్సిట్, మిసెస్ వీ) కలుస్తారు. వీళ్ళకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి. వీళ్ళ సహాయంతో ప్రపంచం మొత్తం తన తండ్రి కోసం గాలింపు చర్యలు చేపడుతుంది మెగ్. ఆమెకు తోడుగా తన తమ్ముడితో పాటు మంత్రగత్తెలు కూడా వెళతారు. వీళ్లంతా కామాజోట్ అనే గ్రహం మీదకి వెళ్తారు. అక్కడ ఒక భయంకరమైన దుష్టశక్తి ఉంటుంది. ఆమె తండ్రి కూడా దాని ఆధీనంలో ఉంటాడని వీళ్ళు తెలుసుకుంటారు. ఇక దానిపై పోరాడాలని మెగ్ నిర్ణయించుకుంటుంది. చివరికి మేగ్ తన తండ్రిని కనిపెడుతుందా? అతను ప్రాణాలతో బతికే ఉంటాడా ? టైం ట్రావెల్ మీద అతడు ప్రయాణించి ఉంటాడా ? అదృష్ట శక్తితో మెగ్ ఎలా పోరాడుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాని మిస్ కాకుండా చూడండి.


Read Also : మర్డర్ కేసులో మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్… ఓటిటిలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్

 

యూట్యూబ్ (Youtube) లో

ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ పేరు ‘ఎ రింకిల్ ఇన్ టైమ్’ (A Wrinkle in Time). 2018 లో వచ్చిన ఈ సినిమా మాడెలైన్ ఎల్. ఎంగిల్ 1962లో రాసిన నవల ఆధారంగా రూపొందింది. దీనికి అవా డువర్నే దర్శకత్వం వహించారు. ఈ స్టోరీలో ముగ్గురు జ్యోతిష్యుల సహాయంతో, తప్పిపోయిన తమ తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు బయలుదేరారు. అక్కడి నుంచి స్టోరీ ఆ ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఓప్రా విన్‌ఫ్రే, రీస్ విథర్‌స్పూన్, మిండీ కాలింగ్, లెవి మిల్లర్, స్టార్మ్ రీడ్, గుగు మ్బాతా-రా, మైఖేల్ పెనా నటించారు. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

Big Stories

×