Mahesh Vitta : సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమ క్రియేటివితో ప్రేక్షకుల ముందుకు డిఫరెంట్ కంటెంట్ తో వచ్చేస్తుంటారు. అలా తన భాష, యాసతో ప్రేక్షకుల మనసు దోచుకున్నవారిలో కమెడీయన్ మహేష్ విట్టా కూడా ఒకరు. ఈయన తన టాలెంట్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలా మూవీలలో ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.. టాలీవుడ్ కమెడియన్‌గా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేశ్ విట్టా. రీసెంట్ గా మ హేశ్ విట్టా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు శ్రావణి రెడ్డితో ఏడడుగులు వేశాడు. ఆ తర్వాత ఒకటో, రెండో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మహేష్ తన గురించి ఎన్నో ఆసక్తి కర విషయాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో తన లైఫ్ లో చేసిన అతి పెద్ద మిస్టేక్ గురించి వివరించారు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం..
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న మహేష్ విట్టా..
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొన్న మహేష్ విట్టా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడే మహేశ్ తన లవ్ స్టోరీ గురించి రివీల్ చేశాడు. అయితే ప్రియురాలి వివరాలు మాత్రం వెల్లడించలేదు. సుమారు ఐదేళ్లుగా శ్రావణి రెడ్డిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తానికి అనేక పాట్లు పడి, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో హాయిగా కాపురం చేస్తున్నాడు.
Also Read : మనోజ్ తో గోడవ అంటే మనకే చాలా డేంజర్.. వారికి వార్నింగ్ ఇచ్చిన హీరో శింబు..
నేను చేసిన పెద్ద తప్పు అదే..
మహేష్ విట్టా కమెడీయన్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ.. ఇండస్ట్రీలోకి అడుగు ప్రూవ్ చేసుకున్నాడు. తన కామెడీతో ఫేమస్ అయ్యాడు మహేష్ విట్టా. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ గతంలోహీరోగా కూడా మారాడు. గతంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న మహేష్ ప్రస్తుతం బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో కూడా పాల్గొన్నాడు. ఈయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు మహేష్ విట్టా. ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌తో పాటు తన పెళ్లి గురించి కూడా మాట్లాడాడు.. అలాగే జీవితంలో కోలుకోలేని షాక్ తగిలిందని ఒక బాంబ్ పేల్చేశాడు.. కెరీర్ ఓ రేంజ్లో ముందుకు దూసుకుపోతున్న సమయంలో సినిమా చేశాను అదే నేను చేసిన అతి పెద్ద మిస్టేక్.. రిస్క్ చేశాను. సినిమా తీశాను.. నాకు గుణ పాఠం నేర్పించింది. అయిన వెనక్కి తగ్గను. మళ్లీ ఆ తప్పును సరి చేసుకుంటాను.. మళ్లీ చేస్తాను సక్సెస్ అవుతాను అని ధీమాగా చెప్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన కాన్ఫిడెంట్ పై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఆ సినిమాలు ఏంటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.