E-Paper
Advertisement

కాస్ట్యూమ్ కోసం వెళ్తే ఎర్రటి ఆకారం ఎంట్రీ… పాప్ స్టార్ ను పరుగులు పెట్టించే హర్రర్ స్టోరీ

కాస్ట్యూమ్ కోసం వెళ్తే ఎర్రటి ఆకారం ఎంట్రీ… పాప్ స్టార్ ను పరుగులు పెట్టించే హర్రర్ స్టోరీ
Advertisement

Supernatural Horror Movie: పాప్ స్టార్‌గా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఓ మహిళ… తన పాత కాస్ట్యూమ్ డిజైనర్‌ను కలిసిన తర్వాత ఆమె జీవితంలోకి ఓ వింత ఎర్రటి ఆకారం ప్రవేశిస్తే ? మొదట అది భ్రమ అనుకుంటుంది. కానీ అదే ఆకారం మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఆమెను వెంటాడటం మొదలు పెడితే ? పాత స్నేహం, ద్రోహం, ఫేమ్, మానసిక గాయాలతో పాటు సూపర్‌నేచురల్ అంశాలను కలిపిన డేవిడ్ లోవరీ సినిమా ‘Mother Mary’ ఇదే కథతో సాగుతుంది. మరి ఆ ఎర్రటి ఆకారం ఎవరు? అది మేరీని ఎందుకు వెంటాడుతోంది? అనేది కథలో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

మేరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాప్ స్టార్. స్టేజ్‌పై వేలాది మంది అభిమానుల ముందు మెరిసే ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చెప్పుకోలేని గాయాలు ఉంటాయి. ముఖ్యంగా తన కెరీర్‌ను నిర్మించడంలో కీలకంగా ఉన్న బెస్ట్ ఫ్రెండ్, కాస్ట్యూమ్ డిజైనర్ సామ్ అన్సెల్మ్‌ ఆమెకు ఇప్పుడు దూరంగా ఉంటుంది. కొన్ని ఏళ్ల తర్వాత మేరీ కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతుంది. కొత్త కాస్ట్యూమ్ కోసం సామ్‌ను సంప్రదించడంతో ఇద్దరూ మళ్లీ కలుస్తారు. అయితే ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ప్రేమ కంటే కోపం, బాధ, నమ్మకద్రోహం ఎక్కువగా ఉంటాయి. సామ్ తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదని, మేరీ తనను జీవితంలో నుంచి దూరం చేసిందని బాధ పడుతుంది.

Advertisement

ఇదే సమయంలో ఓ వింత ఎర్రటి ఆకారం వారి జీవితాల్లోకి వస్తుంది. సామ్‌కు గతంలోనే ఆ ఆకారం కనిపించి ఉంటుంది. మొదట దాన్ని భ్రమగా భావించినా, మేరీ కూడా దాన్ని చూడటం మొదలు పెట్టడంతో పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఓ సమయంలో ఆ ఆకారం ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత స్టేజ్‌పై మేరీ దాన్ని చూసి కుప్పకూలిపోవడంతో ఆమెకు ఏదో అతీంద్రియ శక్తి తనను వెంటాడుతోందనే అనుమానం బలపడుతుంది.

ఇక్కడి నుంచి మేరీ తన గతాన్ని, సామ్‌తో తెగిపోయిన బంధాన్ని, తనలో దాచుకున్న బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు సామ్ కూడా ఆ ఎర్రటి ఆకారం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అది నిజంగా దెయ్యమా? లేక ఇద్దరి మధ్య పేరుకుపోయిన బాధకు ఓ రూపమా? అనే ప్రశ్నలు కథను మరింత సైకలాజికల్‌గా మారుస్తాయి.

Advertisement

క్లైమాక్స్‌లో మేరీ, సామ్ కలిసి ఆ శక్తిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. అక్కడ జరిగే ఎక్స్‌ఆర్సిజం సీక్వెన్స్ కూడా సాధారణ హారర్ సినిమాల తరహాలో కాకుండా ఫ్యాషన్, సంగీతం, బాడీ హారర్, సూపర్‌నేచురల్ అంశాలను కలిపి డేవిడ్ లోవరీ ప్రత్యేకమైన విజువల్ అనుభూతిని అందించాడు. చివరికి ఇది కేవలం పాప్ స్టార్‌ను దెయ్యం వెంటాడే కథ కాకుండా, గతం నుంచి పారిపోతున్న ఓ కళాకారిణి తనను తాను తిరిగి వెతుక్కునే ప్రయాణంగా మారుతుంది. మరి ఇంతకీ ఆ ఆకారం ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే.

సినిమాను ఏ ఓటీటీలో చూడాలి?

అన్నే హాత్వే మేరీగా, మైఖేలా కోల్ సామ్‌గా నటించారు. డేవిడ్ లోవరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చార్లీ, జాక్ ఆంటోనాఫ్ తదితరులు సంగీతం అందించారు. మ్యూజిక్, ఫ్యాషన్, సైకలాజికల్ డ్రామా, సూపర్‌నేచురల్ హారర్ కలిసిన డిఫరెంట్ మూవీ ఇది. ఇప్పుడు HBO Maxలో అందుబాటులో ఉంది. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 51 నిమిషాలు. ఒక డిఫరెంట్ హర్రర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని డోంట్ మిస్. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే తెలుగు వెర్షన్ ఆడియో లేదు.

Read Also: కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×