BigTV English

OTT Movie : ఏడాది మిస్సింగ్, ఇంటికొచ్చాక తేడాగా… భర్తకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ భార్య చేసే పనికి హ్యాట్సాఫ్ భయ్యా

OTT Movie : ఏడాది మిస్సింగ్, ఇంటికొచ్చాక తేడాగా… భర్తకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ భార్య చేసే పనికి హ్యాట్సాఫ్ భయ్యా

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎప్పటికప్పుడు సరికొత్త థీమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అయితే ప్రపంచం అంతానికి మానవులే కారణం అవుతారా? అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. అలాంటి లైన్ తో, అద్భుతమైన విజువల్స్ తో, రెగ్యులర్ సై-ఫై స్టోరీల్లా కాకుండా సరికొత్తగా తెరకెక్కిన మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీ కథేంటి? స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? అన్నది తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
లీనా (నటాలీ పోర్ట్‌మాన్) ఒక బయాలజీ ప్రొఫెసర్, మాజీ సైనికురాలు. ఆమె భర్త కేన్ (ఆస్కార్ ఐజాక్) కూడా సైనికుడే. ఒక సీక్రెట్ మిషన్‌ లో ఏడాది కాలం ఉన్న తర్వాత సడన్ గా ఇంటికి తిరిగి వస్తాడు. కానీ అతను తీవ్ర అనారోగ్యంతో ఉంటాడు. అసలేం జరిగింది? ఏడాది పాటు ఎక్కడ ఉన్నాడు? అన్న విషయాలను కూడా చెప్పలేకపోతాడు. కేన్‌ను రక్షించే ప్రయత్నంలో లీనా “ది షిమ్మర్” అనే సీక్రెట్, క్వారంటైన్డ్ ప్రాంతంలో ఉన్న ఎక్స్పరిమెంటల్ మిషన్‌ లో చేరుతుంది.

కాగా లీనాతో పాటు ఆ టీంలో డాక్టర్ వెంట్రెస్ (జెన్నిఫర్ జాసన్ లీ), జోసీ (టెస్సా థాంప్సన్), కాసీ (తువా నోవోట్నీ), అన్యా (జినా రోడ్రిగెజ్) ఉంటారు. వీరంతా సైంటిస్టులే. పైగా వివిధ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నవారు. షిమ్మర్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటారు.


ఈ షిమ్మర్ ఒక గ్రహాంతర శక్తి వల్ల ఏర్పడిన ప్రాంతం. ఇక్కడ మొక్కలు, జంతువులు గతంలో ఎన్నడూ చూడని విధంగా వింతగా ఉంటాయి. బృందం కేన్ మునుపటి ఎక్స్‌పెడిషన్ వీడియో ఫుటేజ్‌ను కనుగొంటుంది. ఇందులో ఒక సైనికుడి శరీరంలో అసాధారణంగా కదిలే అవయవాలు కనిపిస్తాయి. షిమ్మర్ జీవుల డీఎన్‌ఎను “రిఫ్రాక్ట్” చేస్తుంది. అంటే ఒక జీవి జన్యు సమాచారం మరొక జీవిలో కలిసిపోతుంది. ఇది భయంకరమైన, అందమైన రూపాంతరాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక ఎలుగుబంటి మనిషి గొంతుతో మాట్లాడుతుంది. లీనా భర్తకు ఏమైంది? షిమ్మర్‌లో ఏముంది? అక్కడికి వెళ్ళిన వీళ్ళంతా ఏమయ్యారు? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : ఇలాంటి లెటర్ వస్తే ఫ్యామిలీ అంతా డేంజర్ లోనే… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే కొరియన్ మూవీ

తెలుగులో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు “అన్హీలేషన్” (Annihilation). అలెక్స్ గార్లాండ్ దర్శకత్వం వహించిన ఒక సైన్స్-ఫిక్షన్ హారర్ చిత్రం, జెఫ్ వాండర్‌మీర్ రాసిన 2014 నవల “అన్హీలేషన్” ఆధారంగా రూపొందింది. షిమ్మర్‌లో మొక్కలు మానవ ఆకారంలో ఉండటం, జంతువులు గ్రహాంతర లక్షణాలతో హైబ్రిడ్‌గా మారడం వంటి వింత సీన్స్ తో ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ఇందులో వయొలెన్స్, హర్రర్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×