E-Paper
Advertisement

OTT Movie : ఇలాంటి లెటర్ వస్తే ఫ్యామిలీ అంతా డేంజర్ లోనే… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే కొరియన్ మూవీ

OTT Movie : ఇలాంటి లెటర్ వస్తే ఫ్యామిలీ అంతా డేంజర్ లోనే… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే కొరియన్ మూవీ
Advertisement

OTT Movie : కొరియన్ మూవీ లవర్స్ కోసం ఓ అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఈరోజు మనం మూవీ సజెషన్ గా తీసుకొచ్చాను. మిస్సింగ్ అంటూ ఓ లెటర్ రావడం, దాని వల్ల ఓ ఫ్యామిలీ అంతా డేంజర్ లో పడడం అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మరి ఈ క్రేజీ కొరియన్ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…
సంగ్-సూ (సన్ హ్యున్-జూ) ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్. తన భార్య మిన్-జీ (జియోన్ మి-సన్), ఇద్దరు పిల్లలతో (హో-సే, సూ-హా) ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తాడు. అతనికి మైసోఫోబియా (జెర్మ్స్ భయం) అనే అరుదైన వ్యాధి ఉంటుంది. అన్న సంగ్-చుల్‌ కు సంబంధించిన ఓ సీక్రెట్ ను తనలోనే దాచుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు. సంగ్-సూను అతని పేరెంట్స్ దత్తత తీసుకుంటారు. అయితే అతను తన సవతి అన్న సంగ్-చుల్‌ ను అసహ్యించుకుంటాడు. గతంలో అతనిపై అత్యాచార ఆరోపణలు వేసి జైలుకు కూడా పంపించి ఉంటాడు. అదే ఆ సీక్రెట్.

Advertisement

ఒక రోజు సంగ్-సూ తన అన్న సంగ్-చుల్ మిస్సింగ్ అని తెలుసుకుంటాడు. అతను తన కుటుంబంతో కలిసి సంగ్-చుల్ నివసించే ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ కు వెళతాడు. అక్కడ తలుపులపై వింత గుర్తులను (సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్) గమనిస్తాడు. అవి “హైడ్ అండ్ సీక్ కోడ్స్”. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు అమ్మాయిలా, అబ్బాయిలా? ఎంతమంది అనేవి సూచిస్తాయి. ఇవే చిహ్నాలు తన సొంత ఇంటి తలుపులపై కూడా కనిపిస్తాయి. దీంతో అతని కుటుంబం ప్రమాదంలో ఉందని సంగ్ సూ భయపడతాడు.

ఈ నేపథ్యంలోనే సంగ్-సూ తన అన్నను కనిపెట్టే ప్రయత్నంలో ఉండగా, ఒక మిస్టీరియస్ వ్యక్తి (నల్లటి దుస్తులు, మోటార్‌సైకిల్ హెల్మెట్ ధరించిన) అతనిని వెంబడిస్తాడు. అదే సమయంలో యున్-హై అనే మహిళ, ఆమె కుమార్తె గురించి షాకింగ్ ట్విస్ట్ వెల్లడవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? తన మిస్సింగ్ కేసుకు వీళ్ళకు ఏంటి సంబంధం? సంగ్ సూను వెంబడిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు సంగ్ సూ అన్నయ్య ఏమయ్యాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : సైకో కిల్లర్ నుంచి యాక్షన్ దాకా… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రేజీ కొరియన్ సినిమాలను చూశారా?

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
కొరియన్ హారర్-థ్రిల్లర్ మూవీ ‘హైడ్ అండ్ సీక్’ (Hide and Seek). 2013లో రిలీజ్ అయిన ఈ మూవీకి హహ్ జంగ్ దర్శకత్వం వహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రం రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఆ ఇద్దరూ తమ ఇళ్లలో అపరిచితులు దాక్కొని ఉన్నారని నమ్ముతారు. ఇక ఈ కథలో సస్పెన్స్, మిస్టరీ, షాకింగ్ ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయి. 2013లో ఈ మూవీ సౌత్ కొరియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 17.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×