OTT Movie : హర్రర్ సినిమాలను కొంతమంది పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారు. అందులో గుండె జారిపోయే సీన్స్ ఉన్నా కూడా చూడకుండా వదలరు. అలాంటి క్రేజీ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే, కంప్లీట్ అయ్యేదాకా ఆపరు. ఇక సినిమాలో ఉండే ట్విస్ట్ లు మాత్రం చూసి తీరాల్సిందే. అయితే ఈ మూవీ చిన్న పిల్లలకు మాత్రం కాదు భయ్యా. ఈ చిత్రం ఒక గుర్తింపు లేని శవం చుట్టూ జరిగే భయంకరమైన సీన్స్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇందులో న్యూ*డ్ సీన్స్, అలాగే హర్రర్ సీన్స్ కూడా ఉంటాయి. మరి ఆ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ వర్జీనియాలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ ఆస్టిన్ టిల్డెన్ (ఎమిలీ హిర్ష్), అతని తండ్రి టామీ టిల్డెన్ (బ్రియాన్ కాక్స్) ఇద్దరూ మంచి ఎక్స్పీరియన్స్డ్ కరోనర్‌లు. ఫ్యామిలీ ఫ్యూనరల్ హోమ్ లో శవ పరీక్షలు నిర్వహిస్తారు.
ఒక రాత్రి షెరీఫ్ బర్క్ (మైఖేల్ మెక్‌ఎల్హాటన్) ఒక గుర్తింపు లేని యువతి శవాన్ని (ఓల్వెన్ కెల్లీ) తీసుకొస్తాడు. పేరు తెలీదు కాబట్టి దాన్ని “జేన్ డో” అని పిలుస్తారు. ఈ శవం దొరికిన దగ్గర మరికొన్ని మర్డర్స్ కూడా జరిగి ఉంటాయి. కానీ ఈ అమ్మాయి మాత్రం విచిత్రమైన విధంగా చచ్చి పడి ఉంటుంది. ఆమె మరణానికి కారణం ఏంటన్నది ఎవరికీ అర్థం కడు. షెరీఫ్ నెక్స్ట్ డే ఉదయానికి ఆ అమ్మాయి అటాప్సి రిపోర్ట్ కావాలని ఒత్తిడి చేస్తాడు.
దీంతో టామీ, ఆస్టిన్ వెంటనే శవ పరీక్షను మొదలుపెడతారు. జేన్ డో శరీరం బయటి నుండి అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. గాయాలు లేదా హింస జాడలు లేకుండా ఉంటుంది. కానీ ఆమె కళ్ళు మేఘావృతమై ఉంటాయి. ఇది సాధారణంగా చనిపోయిన కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది. అయితే ఆమె శరీరం తాజాగా ఉంది. శవపరీక్ష జరిగే కొద్దీ ఆమె శరీరం లోపల గాయాలు ఉన్నాయనే విషయం బయట పడుతుంది. ఊపిరితిత్తులు కాలిపోయినట్లుగా, అనేక ఎముకలు విరిగినట్లుగా కన్పిస్తాయి. కానీ బయటి నుండి ఎటువంటి గాయాలు కనిపించవు. ఆమె శరీరంలో ఒక వింత వస్తువు లభిస్తుంది. ఆమె గోళ్ళ కింద మట్టి ఉంది. అంటే ఆమె బతికి ఉండగానే ఖననం చేశారు.
శవపరీక్ష కొనసాగుతున్న కొద్దీ, ఫ్యూనరల్ హోమ్‌లో వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. లైట్లు ఆరిపోతాయి, తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆస్టిన్‌కు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ తో స్టోరీ మలుపు తిరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎలా చనిపోయింది ? అసలు విషయం తెలుసుకున్న ఆ తండ్రీకొడుకుల పరిస్థితి చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.
Read Also : అవమానించాడని అమ్మాయిని తీసుకెళ్ళి ప్రెగ్నెంట్… ‘కెరెబేటె’ మూవీ రివ్యూ
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఆండ్రీ ఓవ్రెడాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నాచురల్ హారర్ చిత్రం ‘ది ఆటోప్సీ ఆఫ్ జేన్ డో (The Autopsy of Jane Doe). 2016లో వచ్చిన ఈ సినిమాలో బ్రియాన్ కాక్స్, ఎమిలీ హిర్ష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలు అదిరిపోతాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.